రిజిస్ట్రేషన్ల విధానంలో కీలక మార్పులు - ఇక ఇలా..!!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉన్న విధానాలను సమూలంగా మార్పు చేయాలని నిర్ణయించింది .ఈ మేరకు తాజాగా రెవిన్యూ శాఖ సర్క్యులర్ జారీ చేసింది. ఇప్పటి వరకు కోర్టుల్లో జడ్జిల తరహాలో సబ్ రిజిస్ట్రార్లు కూర్చొనే విధానానికి చెల్లు చీటి పలికేలా రిజిస్ట్రేషన్‌ల శాఖ నిర్ణయాలు తీసుకోనుంది. కార్యాలయాల్లోనూ మార్పులకు నిర్ణయించింది.

కీలక మార్పులు
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇకపై రాజరికపు పొకడలకు స్వస్తి పలకనుంది. కో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల రూపు రేఖలు మార్చే అంశంపై ప్రభుత్వానికి రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ సిసోడియా , మంత్రి అనగని సత్య ప్రసాద్ ఆఫీస్ సెటప్‌లో మార్పులు తీసుకురావాలని నిర్ణయించి.. అమలుకు సర్క్యులర్ జారీ చేశారు.అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో ఉన్నట్టుగానే సబ్ రిజిస్ట్రార్ల సీటింగ్ ఆరేంజ్‌మెంట్ ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. సబ్ రిజిస్ట్రార్లు కూడా సామాన్యులేననే భావన కలిగేలా రెవెన్యూ శాఖ కసరత్తు చేస్తోంది.

AP government has ushered in revolutionary changes in the Registration Department

సర్క్యులర్ జారీ
సబ్ రిజిస్ట్రార్‌కు ఉన్న ఎత్తైన పోడియం సీటింగ్ చుట్టూ వున్న రెడ్ క్లాత్ తొలగించాలని ఆర్‌పి సిసోడియా అదేశించారు. సబ్ రిజిస్ట్రార్ చైర్ కూడా ఫ్లోర్ హైట్‌లో ఉండాలని.. ఆయన చుట్టూ ఎలాంటి పార్టిషన్ ఉండకూడదని ఆదేశించారు. భూములు రిజిస్ట్రేషన్‌ల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చేసే సామాన్య ప్రజలకు ఆఫీస్‌లో అత్యధిక గౌరవం ఉండాలని, రిజిస్ట్రేషన్ పూర్తి అయ్యే వరకు వచ్చినవారు నిలబడి వుండే విధానానికి స్వస్తి పలకాలన్నారు.

అంతరం తగ్గేలా
ప్రస్తుత రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రార్లు ఎత్తైన కుర్చీలో విధులు నిర్వహిస్తున్నారు. వారి ఉండే పోడియం చెక్కతో ఉంటుంది. దాని చుట్టూ ఎరుపు రంగు వస్త్రం ఉంటుంది. ఈ విధానం అమర్యాదరకరంగా ఉందని, ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య అంతరం పెంచేలా ఉండటంతో ఈ విధానం మార్పు చేయాలని నిర్ణయించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆలస్యం అయితే వారికి టీ, మంచి నీరు ఆఫర్ చేసి గౌరవించాలని రెవెన్యూ ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా తాజా విధి విధానాలతో సర్క్యులర్ జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+