ఆప్ఘన్ బాధితులకు ఏపీ సర్కార్ సాయం-రాష్ట్ర వాసుల కోసం హెల్ప్ డెస్క్
ఆప్ఘనిస్తాన్ లో చిక్కుకున్న ఏపీ వాసుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఏపీ వాసుల్ని సురక్షితంగా ఇళ్లకు చేర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రత్యేక హెల్ప్ డెస్క్ తో పాటు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు.
ఆప్ఘనిస్తాన్ లో చిక్కుకున్న ఏపీ వాసులు స్వదేశానికి సురక్షితంగా తిరిగి వచ్చేందుకు వీలుగా అవసరమైన సాయం చేసేందుకు ఓ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ఇవాళ ప్రకటింంచింది. ఆప్ఘనిస్తాన్ వెళ్లి అక్కడ పనిచేస్తున్న ఆంధప్రదేశ్ కార్మికుల కోసం కార్మికశాఖ తరఫన ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసింది. ఆప్ఘనిస్తాన్ లో ఉన్న కార్మికులు కానీ , వారికి సంబంధించి ఇక్కడ ఉన్న వారు కానీ ఈ హెల్ప్ డెస్క్ ను సంప్రదించవచ్చని ప్రభుత్వం తెలిపింది. వీరి కోసం టోల్ ఫ్రీ నంబరును కూడా అందుబాటులోకి తెచ్చింది. 0866-2436314 నంబరుకు కానీ లేదా +917780339884 (నానాజీరావు), లేదా సహాయ కార్మిక కమిషనర్ +919492555089 (శ్రీమన్నారాయణ)కు కానీ కాల్ చేయవచ్చని ప్రభుత్వం తెలిపింది.

ఆప్ఘనిస్తాన్ లో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ కార్మికుల వివరాలను ఇప్పటికే సేకరిస్తున్న ప్రభుత్వం.. వీటిని విదేశాంగశాఖకు అందజేయడం ద్వారా వారిని సురక్షితంగా స్వరాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా వారి కుటుంబ సభ్యులు తమకు కాల్ చేసేందుకు వీలుగా ఈ టోల్ ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేసినట్లు కార్మికశాఖ కమిషనర్ రేఖారాణి తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం విదేశాంగశాఖ సాయంతో పలువురితో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లో వీరిని సురక్షితంగా స్వస్ధలాలకు చేర్చనుంది. ఏపీకి చెందిన వందలాది మంది ఆప్ఘనిస్తాన్ లో ఏళ్ల తరబడి వివిధ పనుల కోసం వెళ్లి అక్కడ ఉంటున్నారు. గతంలో భారత ప్రభుత్వంతో ఆప్ఘన్ సర్కార్ సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో వీరికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. కానీ ఇప్పుడు మారిన పరిస్దితులతో వీరికి ఇబ్బందులు తప్పడం లేదు.












Click it and Unblock the Notifications