Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీలో కరెంటు ఛార్జీలు తగ్గుతాయా ? ఈఆర్సీలో ట్రాన్స్ కో పిటిషన్ ..!

ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపు తప్ప తగ్గింపు మాటే తెలియని వినియోగదారులకు ఓ గుడ్ న్యూస్. ఇప్పటివరకూ నష్టాల పేరుతో వినియోగదారులపై ప్రతీ నెలా ఏదో విధంగా ట్రూఅప్ ఛార్జీల భారం మోపుతూ వస్తున్న డిస్కంలు ఇప్పుడు ట్రూడౌన్ స్ధితికి చేరుకున్నాయి. దీంతో ఆ మేరకు తమ నష్టాలు తగ్గి లాభాల్లోకి వస్తామని అంచనా వేస్తున్న విద్యుత్ సంస్ధలు.. విద్యుత్ నియంత్రణ మండలికి కీలక ప్రతిపాదన చేశాయి. దీన్ని ఈఆర్సీ ఆమోదిస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గడం ఖాయంగా కనిపిస్తోంది.

ప్రతీ ఏటా విద్యుత్ పంపిణీ సంస్ధలు తమకు విద్యుత్ ఉత్పత్తికి అయిన ఖర్చు ఆధారంగా ఛార్జీల వసూలుకు విద్యుత్ నియంత్రణ మండలికి ముందస్తుగా ప్రతిపాదనలు ఇస్తాయి. ఆ ప్రతిపాదనలకు మించి వాస్తవ ఖర్చు అయితే అప్పుడు ట్రూఅప్ ఛార్జీల పేరుతో వాటిని వసూలు చేసుకుంటుంటాయి. ఇలా గత కొన్నేళ్లుగా ట్రూఅప్ ఛార్జీల భారం వినియోగదారులపై తీవ్ర స్ధాయిలో ఉంటోంది. కానీ ఈఆర్సీకి ఇచ్చిన ప్రతిపాదనల కంటే తక్కువ ఖర్చు అయితే ట్రూడౌన్ అవుతుంది. అప్పుడు తమకు మిగిలిన డబ్బును తిరిగి వినియోగదారులకు డిస్కంలు సర్దుబాటు చేయాల్సి ఉంది. ఈ మేరకు ఈఆర్సీకి ప్రతిపాదన ఇచ్చాయి.

ap government likely to cut-down power bills of consumers if ERC accept true-down adjustment

రాష్ట్ర పరిధిలో మూడు విద్యుత్ పంపిణీ సంస్ధలు(డిస్కంలు) ఉన్నాయి. ఈ మూడింటికీ కలిపి గత ఐదేళ్లలో అంటే 2019 నుంచి 2024 మధ్య ట్రూ డౌన్ అయినట్లు అంటే వాస్తవ ఖర్చు ఈఆర్సీ అనుమతించిన దాని కంటే రూ.1059 కోట్లు తక్కువగా అయినట్లు డిస్కంలు తెలిపాయి. ఈ మేరకు ఈపీడీసీఎల్ రూ.383.84 కోట్లు, ఎస్పీడీసీఎల్ రూ.428.56 కోట్లు, సీపీడీసీఎల్ రూ.247.35 కోట్లు ట్రూడౌన్ అయినట్లు ఈఆర్సీకి తెలిపాయి. ఇలా మొత్తం రూ.1059 కోట్లను వినియోగదారులకు సర్దుబాటు చేసేందుకు అనుమతి కోరుతూ ట్రాన్స్ కో ఈఆర్సీలో పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని ఈఆర్సీ ఆమోదిస్తే ఆ మేరకు కస్టమర్లకు బిల్లులు తగ్గబోతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+