AP Budget: ఏపీ ముందు 15 ఆర్ధిక సవాళ్లు-బడ్జెట్ లో తేల్చేసిన సర్కార్..!

ఏపీ అసెంబ్లీలో ఇవాళ ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో పలు కీలక అంశాలున్నాయి. సాధారణంగా బడ్జెట్ లో ఉండే రాబడి, వ్యయాలు, పథకాలు, ఇతర అంశాలతో అసలు ఏపీ ఎదుర్కొంటున్న 15 ఆర్ధిక సవాళ్లను కూడా ప్రస్తావించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వం ఈ సవాళ్లను బడ్జెట్ లో ప్రస్తావించింది. దీంతో బడ్జెట్ అమలుకు ఇవి అడ్డంకి అవుతాయా అన్న చర్చ జరుగుతోంది.

ఇవాళ బడ్జెట్ లో ప్రభుత్వం ప్రస్తావించిన ఆర్ధిక సవాళ్లలో రాష్ట్ర ఆర్ధిక వ్యవహారాల దుర్వినియోగం, రాష్ట్ర వనరుల మళ్లింపు, లోప భూయిష్టమైన ఎక్సైజ్, ఇసుక విధానాల వల్ల, సహజ వనరుల దోపిడీ వల్ల రాష్ట్ర ఆదాయానికి గండిపడటం, ప్రభుత్వ పన్నులను దారి మళ్లించడం వల్ల రాబోయే 25 సంవత్సరాల భవిష్యత్తు ఆదాయాన్ని గణనీయంగా గండి కొట్టడం, పరిమితికి మించి రుణాలను అధిక వడ్డీ రేట్లకు తీసుకోవడం ఉన్నాయి.

ap government mentioned these key challenges in budget implementation

అలాగే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించి రుణాలు తీసుకోవడం, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల మళ్లింపు, పిల్లల పౌష్టికాహారం కోసం చిక్కి, వైద్య సామాగ్రి వంటి ముఖ్యమైన పథకాలకు చెల్లింపుల నిలుపుదల, స్దానిక సంస్థల నిధుల మళ్లింపు, ఉద్యోగులకు పేరుకుపోయిన బకాయిలు, వివిధ పనులకు చెందిన బిల్లుల బకాయిలు, అన్ని ప్రాజెక్టులను స్తంభింపజేయడం ద్వారా నీటిపారుదల రంగ పతనం, ఇంధన రంగ విధ్వంసం, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థ ఏర్పాటు ద్వారా కార్పోరేషన్ల నిధుల మళ్లింపు ఉన్నాయి. వాస్తవానికి ఇవన్నీ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో చోటు చేసుకున్న పరిణామాలే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+