ఏపీలో క్వార్టర్ బాటిల్ రూ.99కి ఎప్పటి నుంచో తెలుసా ?
ఏపీలో మద్యం షాపుల లాటరీ పూర్తికావడంతో షాపుల కేటాయింపు జరుగుతోంది. రేపటి నుంచి కొత్త షాపుల్లో మద్యం అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో ఉన్న బ్రాండ్లన్నీ తిరిగి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అదే సమయంలో 99 రూపాయలకే ఇవ్వాలని భావించిన క్వార్టర్ బాటిల్ మద్యాన్ని కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
గత వైసీపీ ప్రభుత్వంలో భారీ మద్యం ధరలతో మందుబాబులు అల్లాడిపోయారు. దీంతో కూటమి ప్రభుత్వం క్వార్టర్ బాటిల్ మద్యాన్ని రూ.99కే ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నాలుగు జాతీయ కంపెనీలతో వీటి సరఫరా కోసం చర్చలు జరుపుతోంది. అయితే ఎంత స్టాక్ తీసుకోవాలనే దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఆరంభంలో ఓ 2 లక్షల కేసులు తీసుకుని ఆ తర్వాత మిగిలిన స్టాక్ విషయంలో నిర్ణయం తీసుకోనున్నారు.

కొత్త ఎక్సైజ్ పాలసీలో భాగంగా క్వార్టర్ రూ.99 ధరతో మద్యం అందుబాటులోకి తెస్తామని చేసిన ప్రకటనకు అనుగుణంగా వారంలోపు దీన్ని అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 99కే క్వార్టర్ బాటిల్ సరఫరా చేసేందుకు ముందుకొచ్చిన కంపెనీలు ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లోనూ సప్లై చేస్తున్నాయి. కాబట్టి వీటి నుంచి తొలుత 2 లక్షల కేసులు తీసుకోబోతున్నారు. అనంతరం మందుబాబుల స్పందన చూసి తర్వాత స్టాక్ కు ఆర్డర్ పెట్టబోతున్నారు.
మరోవైపు మద్యం ధరల విషయంలోనూ పారదర్శకంగా ఉండాలని భావిస్తున్న ప్రభుత్వం ఇందుకోసం ఓ కమిటీని నియమించబోతోంది.ఇప్పటికే ఉన్న మద్యం బాటిళ్ల ధరలను ఈ కమిటీ సవరించి ఫైనల్ చేస్తుంది. ఇందులో పాత బ్రాండ్ల ధరల సవరణతో పాటు కొత్త బ్రాండ్ల ధరల నిర్ణయం కూడా ఉంటుంది. ఆ తర్వాత నుంచి కమిటీ నిర్ణయించిన కొత్త ధరల మేరకే విక్రయాలు జరగబోతున్నాయి.












Click it and Unblock the Notifications