అమరావతికి టాలీవుడ్‌!: సినీ రంగ ప్రముఖులతో చర్చలు.. సీఆర్డీయే ప్రతిపాదనలు రెడీ

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu
  అమరావతికి టాలీవుడ్‌! ప్రముఖులతో చర్చలు

  హైదరాబాద్/ అమరావతి: తెలుగింట చలన చిత్రసీమ భాగ్యనగరం చుట్టూ పరివేష్టితమై ఉన్నది. దాదాపు 30 ఏళ్ల క్రితం నుంచి నాటి ఉమ్మడి ఏపీ రాజధాని హైదరాబాద్ నగరానికి తరలి వచ్చిన టాలీవుడ్.. దాదాపుగా పూర్తిగా సినీ రంగం స్థిర పడింది. పూర్తిగా హైదరాబాద్ నగరం తమదేనన్న అభిప్రాయం తెలుగు సినీ రంగ ప్రముఖుల్లో నెలకొన్నదంటే అతిశయోక్తి కాదు. కానీ పాలకులు తెలంగాణ పట్ల అనుసరించి వివక్షా పూరిత వైఖరికి వ్యతిరేకంగా ఏళ్ల తరబడి ఉద్యమం ద్వారా ప్రత్యేక రాష్ట్రం కల సాకారమైంది.

  అయితే తెలుగు చలన చిత్ర రంగ ప్రముఖుల్లో అత్యధికులు.. దాదాపుగా ఆంధ్రులే ఎక్కువగా ఉంటారు. కానీ వారు హైదరాబాద్ నగరానికి తరలి వచ్చినప్పటి నుంచి సినీ ప్రముఖులను భాగ్యనగర వాసులు అక్కున చేర్చుకున్నారు. వారంతా తమ వారేనన్న అభిప్రాయం ఏర్పడింది. కానీ ఏపీ విడిపోయినందున.. చంద్రబాబు ప్రభుత్వం తెలుగు చలన చిత్ర రంగ పరిశ్రమను ప్రతిపాదిత 'అమరావతి'కి తరలించేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది.

   టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులతో చర్చలు జరిపిన ఏపీ సర్కార్

  టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులతో చర్చలు జరిపిన ఏపీ సర్కార్

  సినీ రంగ పరిశ్రమ తరలి రావడానికి అవసరమైన రాయితీలు ఇవ్వడానికి క్యాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ (సీఆర్డీఏ) ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది. అంతే కాదు 20 నుంచి 30 ఎకరాల భూమిలో స్టూడియో నిర్మాణానికి కూడా కసరత్తు చేసిందన్న వార్తలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ కు తరలి వచ్చేతెలుగు సినీ పరిశ్రమ (టాలీవుడ్‌)కు రాయితీలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. సినిమాలకు రాయితీలు, ప్రోత్సాహకాలు ఇచ్చి ఆకర్షించాలని యత్నిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. ప్రతిపాదిత రాజధాని నగర పరిధిలోని అనంతవరంలో శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం సమీపంలోని 5,167 ఎకరాల్లో మీడియా సిటీని ప్రభుత్వం ప్రతిపాదించిన విషయం తెలిసిందే.

   టెలికం, మీడియా రంగానికి ప్రోత్సాహాలు ఇలా

  టెలికం, మీడియా రంగానికి ప్రోత్సాహాలు ఇలా

  మీడియా నగరంలో సినీ - టెలివిజన్‌ పరిశ్రమ, నిమేషన్ ‌- వీఎఫ్‌ఎక్స్ ‌- గేమింగ్, డిజిటల్‌ యాడ్‌ - సోషల్‌ మీడియా, టెలికం రంగాలను ప్రోత్సహించనుంది. అమరావతిలో20 నుంచి 30 ఎకరాల్లో స్టూడియో నెలకొల్పడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీన్ని ఏర్పాటు చేసే సంస్థలకు నామమాత్రపు ధర (ఎకరం రూ. 50లక్షలు)కు భూములిస్తామని ప్రకటించింది. ఇక్కడ సినిమాను నిర్మిస్తే ప్రొడక్షన్‌ ఖర్చులో కొంత మొత్తాన్ని రీయింబర్స్‌ చేయడం, నగదు ప్రోత్సా హకాలు ఇవ్వడం వంటి అంశాలను పరిశీలిస్తోంది. సినిమాలకు సింగిల్‌ విండో అనుమతులిచ్చేందుకు ప్రణాళిక రూపొందించింది. అమరావతిలో ప్రారంభించే తెలుగు న్యూస్‌ చానళ్లకు తక్కువ ధరకే భూములివ్వాలని నిర్ణయించింది.

   బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులకు ఇలా ఆహ్వానం

  బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులకు ఇలా ఆహ్వానం

  తొలి దశలో 2017 నుంచి 2021 వరకూ సమగ్ర వాణిజ్య పార్క్‌ను ఏర్పాటు చేసి మీడియా హౌస్‌లను రప్పించనున్నారు. రెండో దశలో 2021 నుంచి 2036 వరకూ అంతర్జాతీయ స్థాయిలో అమరావతి ఫిల్మ్‌ ఫెస్టివల్‌ జరుపుతారు. ఆ స్థాయి స్టూడియోనూ నెలకొల్పాలనేది ప్రభుత్వ ఉద్దేశమని సీఆర్‌డీఏ వర్గాల కథనం. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులకు ప్రభుత్వం ఆహ్వానాలు పలుకు తోంది. స్టూడియో ఏర్పాటుకు బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగన్, బాలీవుడ్‌ ప్రముఖుడు సుభాష్‌ ఘయ్‌లను ఆహ్వానించి చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.

   భాగ్య నగరానికే తలమానికం ‘రామోజీ ఫిల్మ్ సిటీ'

  భాగ్య నగరానికే తలమానికం ‘రామోజీ ఫిల్మ్ సిటీ'

  అయితే హైదరాబాద్ నగరం చుట్టూ చలనచిత్ర రంగానికి అవసరమైన మౌలిక వసతులన్నీ కొలువు తీరాయి. మీడియా మొఘల్‌గా కీర్తి సంపాదించుకున్న ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు 25 ఏళ్ల క్రితమే హైదరాబాద్ నగర శివారుల్లో ‘రామోజీ ఫిల్మ్ సిటీ' ఏర్పాటు చేశారు. ప్రక్రుతి సిద్ధంగా పలు ప్రాంతాలు సినిమాల నిర్మాణానికి వెసులుబాటు కూడా ఉన్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ వసతులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో తెలుగు చలన చిత్ర రంగ ప్రముఖులు అమరావతి నగరానికి ఏ మేరకు తరలి వెళతారో వేచి చూడాల్సిందే మరి. ఇక ఇటీవల హైదరాబాద్ నగరంలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్న సినీ ప్రముఖులు ‘మన హైదరాబాద్.. మన ముఖ్యమంత్రి కేసీఆర్' అని పేర్కొంటూ భాగ్యనగరం తమదేనని చెప్పడం గమనార్హం.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  AP Government has planning to transfered Amaravati. In this context Government ready to give sops them. Already Governments officials discussed with cini celebreties.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి