Ap Employees Transfers: ఉద్యోగులకు గుడ్ న్యూస్-బదిలీలు, పోస్టింగ్ ల మార్గదర్శకాల విడుదల..!

ఏపీలో ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్ లకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న బదిలీల ప్రక్రియ చేపట్టేందుకు సిద్దమైన ప్రభుత్వం.. ఇందుకు సంబంధించి విధివిధానాలను ఇవాళ జీవో ద్వారా వెల్లడించింది. వీటి ప్రకారం బదిలీలు, పోస్టింగ్ ల ప్రక్రియ సాఫీగా నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

ap government releases guidelines and employees transfers- here are full details

రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఆగస్టు 19 నుంచి 31 వరకూ సడలిస్తున్నట్లు ప్రభుత్వం ఇవాళ విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎక్సైజ్ శాఖ మినహా 14 శాఖలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొంది. అలాగే ఎక్సైజ్ శాఖలో ఉద్యోగులకు మాత్రం సెప్టెంబర్ 5 నుంచి 15వ తేదీ వరకూ బదిలీలకు అవకాశం కల్పించారు. తొలి విడతలో భాగంగా ఈ నెలలో రెవెన్యూ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్ శాఖ, గ్రామ, వార్డు సచివాలయాలు, పౌరసరఫరాలు, మైనింగ్, జియాలజీ, అన్ని శాఖల్లో ఇంజనీరింగ్ సిబ్బంది, దేవాదాయశాఖ, రవాణా శాఖ, ఈఎఫ్ఎస్ అంట్ టీ, పరిశ్రమలు, విద్యుత్, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పన్నుల శాఖల్లో ఉద్యోగులకు బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

వీరి బదిలీలు, పోస్టింగ్ ల కోసం ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలను విడుదల చేసింది. ఇందులో జూలై 31 నాటికి ఒకే చోట ఐదేళ్లు పనిచేసిన ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలని ఆదేశించింది. ఎన్నికల సమయంలో ఈసీ చేసిన బదిలీ కాలాన్ని ఇప్పుడు బదిలీ కోసం పరిగణనలోకి తీసుకోరు. బధిర ఉద్యోగులు, మానసిక సమస్యలతో బాధపడుతున్న పిల్లలు కలిగిన వారు, ఏజెన్సీ ప్రాంతాల్లో రెండేళ్లకు పైగా పనిచేసిన వారు, 40 శాతం పైగా దివ్యాంగులు, కుటుంబం కారణాలతో, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఉద్యోగులకు, భర్తల్ని కోల్పోయి ఉద్యోగాలు పొందిన మహిళలకు బదిలీల్లో ప్రాధాన్యం కల్పిస్తారు.

కంటిచూపులేని ఉద్యోగులకు వారు కోరుకుంటే తప్ప బదిలీలు చేయకూడదని ప్రభుత్వం నిర్దేశించింది. అలాగే భార్యా భర్తలు ప్రభుత్వ ఉద్యోగులు అయితే వారిద్దరినీ ఒకే చోట లేకపోతే సమీప ప్రాంతాలకు బదిలీ చేయొచ్చని తెలిపింది. ప్రమోషన్ పొందిన ఉద్యోగులకు ఆ పోస్టులు కొత్త ప్రాంతంలో లేకపోతే తప్ప కచ్చితంగా బదిలీ చేయాలని తెలిపింది. ఏజెన్సీ ప్రాంతాల్లో పోస్టుల్ని ముందుగా భర్తీ చేసి ఆ తర్వాత మిగతా ప్రాంతాల్లో పోస్టుల్లో బదిలీలు చేపట్టాలని సూచించింది. అలాగే ఐటీడీఏ మాత్రమే కాకుండా మారుమూల ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్న పోస్టుల్ని ముందుగా భర్తీ చేసేలా కలెక్టర్లు మార్గదర్శనం చేయాలని సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+