చంద్రబాబుపై వ్యాఖ్యలు: ఆ జిల్లా కలెక్టర్‌పై ఏపీ ప్రభుత్వం సీరియస్!
గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండేపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్రుగా ఉంది. ఒక కుటుంబానికి ఒకే పెన్షన్ విధానం మంచిది కాదని... ఈ విషయం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెప్పినా పట్టించుకోలేదంటూ ఇటీవల
అమరావతి: గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండేపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్రుగా ఉంది. ఒక కుటుంబానికి ఒకే పెన్షన్ విధానం మంచిది కాదని... ఈ విషయం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెప్పినా పట్టించుకోలేదంటూ ఇటీవల ఓ సభలో కలెక్టర్ వ్యాఖ్యానించారు.
కాగా, ఈ వ్యాఖ్యలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. అత్యున్నత ఉద్యోగి అయి ఉండి కూడా ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా ప్రవర్తించడం పట్ల ఆగ్రహం వ్యక్తి చేసింది. నేపథ్యంలో కలెక్టర్ దండే నుంచి వివరణ కోరాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఆయన ఇచ్చే వివరణ సంతృప్తికరంగా లేకపోతే, ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. సర్వీస్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఓ ఐఏఎస్ అధికారి ఇలాంటి వ్యాఖ్యలు బహిరంగంగా చేయడం మంచిది కాదని సీనియర్ ఐఏఎస్ అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications