'కోమట్లు' పుస్తకంపై బాబు సీరియస్, నిషేధం దిశగా?,టైటిల్ మార్చుతానని కంచ ఐలయ్య

Posted By:
Subscribe to Oneindia Telugu
  Book on Arya Vysyas lands Kancha Ilaiah in trouble 'కోమట్లు' పుస్తకంపై బాబు సీరియస్| Oneindia Telugu

  అమరావతి: వివాదాస్పద రచయిత కంచ ఐలయ్య పుస్తకంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయిందని తెలుస్తోంది. సామాజిక స్మగ్లర్లు కోమట్లు అనే పుస్తక వివాదంపై ఏపీ ప్రభుత్వం తీవ్రంగా స్పందించిందని తెలుస్తోంది.

  కంచ ఐలయ్యను అరెస్ట్ చేయకుంటే, చర్చకు సిద్ధం: ఆర్య వైశ్య సంఘం

  వైశ్యుల అభ్యంతరాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. డిజిపితో చంద్రబాబు భేటీ అయ్యారు. కులాల మధ్య చిచ్చుపెట్టే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాదు, కోమట్లపై వచ్చిన పుస్తకాన్ని నిషేధం విధించే దిశగా చర్యలు తీసుకుంటోందని తెలుస్తోంది.

  అలా ఉంటే చర్యలు తీసుకోండి

  అలా ఉంటే చర్యలు తీసుకోండి

  వర్గాల మధ్య చిచ్చుపెట్టేలా ఉంటే కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందేనని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పైనా అధికారులు వివరించారు.

  అది అనువాదం

  అది అనువాదం

  కాగా, తన పుస్తకంపై ఆర్యవైశ్య సంఘాలు మండిపడుతున్న నేపథ్యంలో కంచ ఐలయ్య దీనిపై స్పందించారు. 2007లో రాసిన పుస్తకానికి తెలుగు అనువాదం తాజా పుస్తకం అని చెప్పారు. ప్రస్తుతం వైశ్య సామాజిక వర్గంలో చాలా మార్పులు వచ్చాయన్నారు.

  టైటిల్ మార్చేందుకు సిద్ధం

  టైటిల్ మార్చేందుకు సిద్ధం

  ఇతర సామాజిక వర్గాలతో కలిసి వ్యాపార భాగస్వామ్యం పంచుకునే పరిస్థితులు వచ్చాయని, వైశ్య సామాజిక వర్గంపై ఇప్పుడు పుస్తకం రాయాల్సి వస్తే, మారిన పరిస్థితులకు తగినట్టుగానే రాస్తానని కంచ చెప్పారు. తన పుస్తకంపై సుహృద్భావ వాతావరణంలో చర్చించాలని విఙ్ఞప్తి చేశారు. ఈ పుస్తకం టైటిల్, అంశాలు మార్చేందుకు తాను సిద్ధమని, ఆర్యవైశ్య ప్రతినిధులు వస్తే చర్చించి మార్పులు చేస్తానని చెప్పారు.

  కులమతాల మధ్య చిచ్చుపెట్టే వారి పట్ల అప్రమత్తం

  కులమతాల మధ్య చిచ్చుపెట్టే వారి పట్ల అప్రమత్తం

  కులమతాల మధ్య చిచ్చు పెట్టే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి నారా లోకేష్ అన్నారు. లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. చంద్రబాబు స్పీడును నేను కూడా అందుకోలేకపోతున్నానని చెప్పారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Andhra Pradesh government serious on writer kancha ilaiah's controversial book. AP CM Nara Chandrababu Naidu has orders to take action if that book is controversial.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X