ప్రధానికి సీఎం చంద్రబాబు స్పెషల్ రిక్వెస్ట్..!!

ఏపీ లో కూటమి ప్రభుత్వంతో గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తోంది. కీలక అంశాల్లో సానుకూలం గా స్పందిస్తోంది. రాజధాని, అమరావతి విషయాల్లో ఆర్దికంగా సాయం ప్రకటించింది. ఏపీకి రైళ్లు, రోడ్ల విషయంలో ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పుడు తాజాగా ఏపీ ప్రభుత్వం నుంచి మరో కీలక ప్రతిపాదన కేంద్రానికి చేరింది. కోల్ కతా కు అందించిన సహకారం తరహాలోనే తమకు మద్దతు ఇవ్వాలని కోరింది. దీని పైన కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

మెట్రో ప్రాజెక్టులు
ఏపీ ప్రభుత్వం తాజాగా విశాఖ, విజయవాడలో మెట్రో ప్రాజెక్టుల పైన ప్రతిపాదనలు సిద్దం చేసింది. ఈ రెండు నగరాల్లో మెట్రోరైలు ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు రూ. 42,362 కోట్లు సమకూర్చాలని కేంద్రానికి రాష్ట్రం ప్రతిపాదించింది. విజయవాడ మెట్రోకు రూ.25,130 కోట్లు, విశాఖ మెట్రోకు 17,232 కోట్లు అవసరమని అంచనాగా పేర్కొది. విభజన చట్టం ప్రకారం ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రమే నిధులివ్వాలని కోరింది. మెట్రో భూ సేకరణకు అయ్యే ఖర్చును తాము భరిస్తామని వెల్లడిచింది. 2014-19లో టీడీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడ, విశాఖలో మెట్రోరైలు ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రయత్నం జరిగింది.

AP government submits proposals for central over Visakha and Vijayawada Metro

ప్రభుత్వ ప్రతిపాదనలు
ఆ సమయంలోనే ప్రాజెక్టు నివేదికలు కేంద్రం ఆమోదం కోసం పంపారు. కానీ, మెట్రోరైలు కొత్త విధానం ప్రకారం వాటిని సవరించాలని కేంద్ర పట్టణ, గృహనిర్మాణ మంత్రిత్వశాఖ సూచించింది.
2024 ధరల ప్రకారం రెండు నగరాల్లో మెట్రో ప్రాజెక్టులకు రూ. 42,362 కోట్లు సమకూర్చాలని కేంద్రానికి ప్రతిపాదించింది. విజయవాడలో రెండు దశల్లో 3 కారిడార్లకు రూ.25,130 కోట్లు, విశాఖలో 2 దశల్లో 4 కారిడార్ల పనులకు 17,232 కోట్లు అవసరమని అంచనా వేసింది. ఈ రెండు నగరాల్లో కలిపి మెట్రోకు అవసరమైన 258 ఎకరాల భూ సేకరణకు అయ్యే రూ.2,799 కోట్లను మాత్రం రాష్ట్రం భరిస్తుందని సంసిద్దత వ్యక్తం చేసింది.

కేంద్రానికి వినతి
ఇదే సమయంలో కేంద్రం కోల్‌కతాలో తూర్పు-పశ్చిమ మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మాణానికి 2017 మెట్రోరైలు పాలసీలో 100 శాతం నిధులు సమకూర్చిన విషయాన్ని ఏపీ ప్రభుత్వం గుర్తు చేస్తోంది. ఏపీకి ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిమితులు, నిధుల కొరత దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు మొత్తం కేంద్రమే భరించాలని అభ్యర్దించింది. కోల్ కతాకు అందించిన సాయం తరహాలోనే ఆంధ్రప్రదేశ్‌కూ నిధులివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 17, 18 తేదీల్లో సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. ఆ సమయంలో ప్రధానికి వ్యక్తిగతంగా ఈ ప్రాజెక్టు పైన ప్రతిపాదన మరోసారి అందించనున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+