ఆ కుటుంబాలకు రూ 10 వేలు - ఏపీ ప్రభుత్వ నిర్ణయం..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అవయవదానం చేసిన దాతల భౌతిక కాయాలకు అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వ నిర్ణయించింది. జిల్లా కలెక్టర్ లేదా సీనియర్ అధికారి అంతిమ సంస్కారంలో పాల్గొనాలని ఆదేశించింది. అవయవ దాతల కుటుంబాలకు పారితోషికంగా రూ.10 వేలు ఇవ్వనున్నారు. ఈ మేరకు అవయవదానంపై ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.
ఏపీలో అవయవదాతల అంతిమ సంస్కారాలు.. ఇక నుంచి ప్రభుత్వం తరుఫున నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ఏపీ ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు జారీ చేశారు. బ్రెయిన్ డెడ్ కేసుల అవయవాల సేకరణపై ఈ గైడ్‌లైన్స్ పాటించాలని అధికారులకు సూచించారు. అవయవదానానికి సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వ ఆస్పత్రి డీన్, మెడికల్ సూపరింటెండెంట్, జిల్లా కలెక్టర్ ఇవ్వాలని స్పష్టం చేశారు. అవయవ సేకరణ అనంతరం ఆసుపత్రి నుంచి భౌతిక కాయాన్ని ఉచితంగా తరలించనున్నారు.

అంత్యక్రియలకు రూ.10వేల ఆర్ధిక సాయం చేయనున్నారు. అలాగే జిల్లా కలెక్టర్ తరఫున ప్రభుత్వ ప్రతినిధిగా ఒకరు హాజరు కావాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. దీని పైన స్వచ్చం సంస్థల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అవయవదానం ప్రోత్సహించేలా ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నార. అదే సమయంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం అందించేందుకు కృషి చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ, ఆస్పత్రుల పనితీరును మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని చెప్పారు.












Click it and Unblock the Notifications