మహిళలకు ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్..! ఇంటికొచ్చి మరీ పిలుపు..!

ఏపీలో మహిళలకు ప్రభుత్వం ఇవాళ మరో శుభవార్త చెప్పింది. మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వారి కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో క్యాన్సర్ బారిన పడి ఆస్పత్రుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ముందస్తుగా ఉచితంగా పరీక్షలు చేయించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఇంటింటి ప్రచారం కూడా చేపడుతోంది. ఈ మేరకు వైద్య సిబ్బంది ఇంటింటికీ రాబోతున్నారు.

ప్ర‌భుత్వం ఇంటింటికీ వ‌చ్చి చేసే ఉచిత క్యాన్స‌ర్ స్క్రీనింగ్ టెస్ట్ ల‌ను చేసుకునేందుకు మ‌హిళ‌లు ముందుకు రావాల‌ని ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ క‌మీష‌న‌ర్ జి.వీర‌పాండియ‌న్ ఇవాళ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని మ‌హిళ‌లంద‌రూ ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఆయ‌న కోరారు. జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ ఛాంబ‌ర్‌లో క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ జి.ల‌క్ష్మీశాతో క‌లిసి మ‌హిళ‌ల‌కు ప్ర‌త్యేక క్యాన్స‌ర్ ప‌రీక్ష‌కు ఆహ్వానం పేరుతో రూపొందించిన ఇన్విటేష‌న్ కార్డును ఆవిష్క‌రించారు.

AP Government to Invite Women for Free Cancer Screening via Doorstep Campaign

నాలుగో విడ‌త ఎన్సీడీ(నాన్ క‌మ్యున‌క‌బుల్ డిసీజెస్‌) స్క్రీనింగ్‌ను ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సెప్టెంబ‌ర్ 17న ప్రారంభించార‌ని, ప్ర‌త్యేకించి ఇది క్యాన్స‌ర్ స్క్రీనింగ్ కు ఉద్దేశించిన‌ద‌ని తెలిపారు. ఇవాళ్టి నుంచి క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమాన్ని విజయవాడ నుంచి ప్రారంభిస్తున్నామ‌న్నారు. మూడ‌వ విడ‌త ఎన్సీడీ స్క్రీనింగ్ లో ఎదురైన అనుభ‌వాలు, స‌వాళ్ల‌ను ప‌రిశీలించిన అనంత‌రం 4వ విడ‌త‌లో ప్ర‌త్యేకించి క్యాన్స‌ర్ స్క్రీనింగ్ పై దృష్టిపెట్టాల‌ని వైద్యారోగ్య మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ ఆదేశించార‌న్నారు. 4వ విడ‌త ఎన్సీడీ స్క్రీనింగ్ పై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు పెద్దఎత్తున ప్ర‌చారాన్ని చేప‌ట్టామ‌ని, ఇందుకోసం ఇన్ఫ‌ర్మేష‌న్‌ ఎడ్యుకేష‌న్ మ‌రియు క‌మ్యూనికేష‌న్‌(ఐఇసి) కార్య‌క్ర‌మం కింద పోస్ట‌ర్లు, క‌ర‌ప‌త్రాల్ని ప్ర‌చురించి జిల్లాల‌కు పంపించామ‌న్నారు.

రాష్ట్రంలోని ప్ర‌తి గ్రామంలో ఇంటింటికీ వెళ్లి 18 ఏళ్లు పైబ‌డిన ప్ర‌తి ఒక్క‌రికీ అసంక్ర‌మిక వ్యాధులైన ర‌క్త‌పోటు(బీపీ), మ‌ధుమేహం(బ్ల‌డ్ షుగ‌ర్‌) ప‌రీక్ష‌ల్ని ఉచితంగా చేస్తార‌న్నార‌న్నారు. ప్ర‌త్యేకంగా మ‌హిళ‌ల‌కు రొమ్ము , గ‌ర్భాశ‌య ముఖ ద్వార ప‌రీక్ష‌ల‌కు సంబంధించి అవ‌గాహ‌న క‌ల్పించి, స్క్రీనింగ్ చేసి, స‌మీప వైద్యాధికారికి స‌మాచారాన్ని అందిస్తార‌న్నారు. నిర్దిష్ట స‌మ‌యాల్లో వైద్యాధికారి వీరికి అవ‌స‌ర‌మైన ప‌రీక్ష‌లు చేసి, ల‌క్ష‌ణాలుంటే ఆయా జిల్లాల ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో ప్ర‌త్యేకించి ఏర్పాటు చేసిన ప్రివెంటివ్ అంకాల‌జీ యూనిట్లలో (రూం నంబ‌రు 222) స్పెష‌లిస్ట్ డాక్ట‌ర్లు చికిత్స అందిస్తార‌న్నారు. గ్రీన్ చాన‌ల్ చికిత్సను అందించ‌డం ద్వారా అదే రోజు మ‌హిళ‌లు తిరిగి ఇంటికి వెళ్లేలా ప్రభుత్వం ఏర్పాటు చేసింద‌న్నారు.

బీపీ, షుగర్, ఎనీమియాతో పాటు క్యాన్స‌ర్‌కు సంబంధించి 18 ఏళ్లు దాటిన (జ‌నాభాలో 70 శాతం) వారిని స్క్రీనింగ్ చేయ‌గా 2 ల‌క్ష‌ల అనుమానిత కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయ‌ని, వీరిలో 4,500 మందిని జీజీహెచ్‌ల‌లోని ప్రివెంటివ్ అంకాల‌జీ యూనిట్ల‌కు పంపించామ‌ని చెప్పారు. వీరిలో 783 మందికి క్యాన్స‌ర్ చికిత్స అవ‌స‌ర‌మ‌ని తేలింద‌న్నారు. ముంద‌స్తు ప‌రీక్ష‌లు చేయించుకోవ‌డం వ‌ల్ల ప్ర‌తి ఒక్క‌రూ కచ్చితంగా క్యాన్స‌ర్ నుండి వ్యాధి నుంచి బయటప‌డొచ్చ‌న్నారు. ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న శైలిలో మార్పుల్ని తీసుకురావ‌డం ద్వారా క్యాన్స‌ర్ ను ఎదుర్కొవ‌చ్చ‌న్నారు.

AP Government to Invite Women for Free Cancer Screening via Doorstep Campaign

గ‌ర్భాశ‌య ముఖ ద్వార క్యాన్స‌ర్‌(స‌ర్విక‌ల్ క్యాన్స‌ర్‌) విష‌యంలో మ‌హిళ‌లు నిర్ల‌క్ష్యాన్ని విడ‌నాడాల‌ని, స్వ‌చ్ఛందంగా ముందుకొచ్చి ఎఎన్ఎం, సిహెచ్ఓల‌కు సహ‌క‌రించాల‌ని కోరారు. స‌ర్విక‌ల్ క్యాన్స‌ర్ విష‌యంలో చాలా మంది మ‌హిళ‌ల్లో నేటికీ అవ‌గాహ‌న లేక‌పోవ‌డం వ‌ల్ల ప్రాణాల్ని కోల్పోతున్నార‌న్నారు. ప్ర‌భుత్వం ఉచితంగా చేసే ముంద‌స్తు స్క్రీనింగ్ ప‌రీక్ష‌ల్ని వినియోగించుకోవ‌డం ద్వారా ప్రాణాపాయ ప‌రిస్థితుల నుండి బ‌య‌ట‌ప‌డొచ్చ‌న్నారు. 30 ఏళ్లు దాటిన మ‌హిళ‌ల ఇంటికి ఎఎన్ఎం, సిహెచ్ఓలు వెళ్లి స‌మీప ఆరోగ్య కేంద్రానికి వ‌చ్చి స్క్రీనింగ్ చేసుకోవాల‌ని ఆహ్వానిస్తూ ఇన్విటేష‌న్ కార్డును అంద‌జేస్తార‌ని, దానిపై ఎప్పుడు, ఎక్క‌డికి రావాలో కార్డుపై రాసి ఇస్తార‌ని తెలిపారు. ఈ అవ‌కాశాన్ని మ‌హిళ‌లు వినియోగించుకోవాల‌ని ఆయ‌న కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+