మోడీ టూర్ కు జగన్ కూ ఆహ్వానం ? మంత్రుల కమిటీ నిర్ణయాలు..!

ఏపీలో అమరావతి రాజధాని నిర్మాణంపై కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులేస్తోంది. గతంలో జరిగిన తప్పిదాల్ని సరిదిద్దుకుని ఈసారి పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది. ఇందులో భాగంగా అమరావతి రాజధాని పునర్ నిర్మాణ పనుల్ని త్వరలో ప్రారంభించబోతోంది.ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీని ముఖ్య అతిధిగా ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో మే2న వచ్చేందుకు ప్రధాని మోడీ కూడా అంగీకరించారు. దీంతో మోడీ టూర్ విజయవంతం చేసందుకు చంద్రబాబు మంత్రుల కమిటీని నియమించారు.

మే2న అమరావతిలో జరిగే ప్రధాని మోడీ టూర్ కు 5 లక్షల మంది వరకూ వస్తారని అంచనా వేస్తున్నారు. ఇందులో ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూసేందుకు, ఇతర ఏర్పాట్ల కోసం నియమించిన మంత్రి వర్గ ఉపసంఘం ఇవాళ సమావేశం అయింది. ఇందులో మంత్రులు నారాయణ,పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్,సిఎస్ విజయానంద్, నోడల్ అధికారి వీర పాండ్యన్,ఇతర అధికారులు పాల్గొన్నారు. వీరు ప్రధాని టూర్ ఏర్పాట్లపై చర్చించారు.

ap government to invite ys jagan to pm modi tour on may 2 ministers committee review arrangements

అనంతరం మంత్రుల భేటీ వివరాలను మున్సిపల్ మంత్రి నారాయణ వెల్లడించారు. ప్రధాని పర్యటన విజయవంతం చేసేందుకు మంత్రులు,అధికారులు చర్చించామని ఆయన తెలిపారు. మే రెండో తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని అమరావతి వస్తారన్నారు. సాంయంత్రం 4 నుంచి 5 గంటల వరకూ బహిరంగ సభ ఉంటుందన్నారు. అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రధాని ప్రారంభిస్తారన్నారు. సభా వేదిక వద్దకు చేరుకునేందుకు ఏడు రోడ్లు గుర్తించామన్నారు. ఇప్పటికే ఎవరెవరు ఏం చేయాలనే బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు.

మోడీ సభకు కనీసం 5 లక్షల మంది ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నట్లు నారాయణ తెలిపారు.సభకు వచ్చే వారికి మంచి నీరు సరఫరా,పార్కింగ్,ఇతర వసతులు కల్పిస్తామన్నారు. అందరూ సమన్వయం చేసుకుని ప్రధాని పర్యటన విజయవంతం చేస్తామని తెలిపారు. అలాగే గతంలో మాదిరిగా ప్రతిపక్షాలను ఇప్పుడు కూడా ఆహ్వానిస్తామని ఆయన క్లారిటీ ఇచ్చారు. గతంలో ప్రధాని మోడీ అమరావతి రాజధాని శంఖుస్థాపనకు వచ్చినప్పుడు అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆహ్వానించినా జగన్ హాజరుకాలేదు. ఈసారి అయినా వెళతారా లేదా చూడాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+