Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కూటమి పాలన పై ప్రజలు హ్యాపీయా - లోపం ఎక్కడ, గ్రౌండ్ రియాల్టీ..!!

ఏపీలో కూటమి ప్రభుత్వం ఆరు నెలల పాలన పూర్తి చేసుకుంటోంది. భారీ అంచనాలతో కూటమి కి ప్రభుత్వం అనూహ్య మెజార్టీ కట్టబెట్టారు. మూడు పార్టీల కూటమి ఆరు నెలల పాలనలో ఏం చేసింది. ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది. పథకాల పైన ఎలాంటి చర్చ జరుగుతోంది. లోపం ఎక్కడైనా సరి చేసుకోవాల్సి ఉందా.. ఇలాంటి అంశాల పైన సీఎం చంద్రబాబు ఫోకస్ చేసారు. అసవరం మేర సరి దిద్దుకోవటానికి సిద్దమయ్యారు. ఇందు కోసం ప్రజాభిప్రాయం మేరకే నిర్ణయాలు ఉండేలా కొత్త కార్యాచరణ డిసైడ్ చేసారు.

పాలన ఎలా ఉంది
ముఖ్యమంత్రి చంద్రబాబు గత అనుభవాలతో కొత్త నిర్ణయాలకు శ్రీకారం చుడుతున్నారు. ప్రజల అభిప్రాయం మేరకే పాలనలో మార్పులు - చేర్పులకు సిద్దం అవుతున్నారు. ఇందుకోసం ప్రజల నుంచి నిరంతరం అభిప్రాయ సేకరణకు సిద్దమవుతున్నారు. ఐవీఆర్ఎస్ ద్వారా పథకాలు.. పాలన పైన ప్రజల నుంచి సూచనలు - సలహాలు తీసుకోవాలని నిర్ణయించారు. ఏ అంశంపైనైనా ప్రజలు చెప్పిందే ఫైనల్ అని స్పష్టం చేశారు. నాణ్యమైన సేవల కోసం ఖచ్చితమైన అభిప్రాయం చెప్పాలని ప్రజలకు చంద్రబాబు సూచించారు. ప్రభుత్వం అమలు చేసే పథకాలతో సహా ఏ నిర్ణయం పైన అయినా సరే ప్రజాభిప్రాయం మేరకే ఉంటుందని సీఎం స్పష్టం చేసారు. దీంతో, కూటమిలో నిర్ణయాలు జరిగినా ప్రజాభిప్రాయం మేరకే అమలు చేయాలని డిసైడ్ అయ్యారు.

AP Government to take feedback on implementation of schemes by IVRS calls to beneficiaries

ప్రజాభిప్రాయం మేరకే
ప్రధానంగా ఎన్నికల్లో అధికారం నిలబెట్టుకోవాలంటే పథకాల లబ్ది దారులే ఓట్ బ్యాంక్ గా భావిస్తున్నారు. దీంతో, పథకాల లబ్ధిదారులకే నేరుగా కంప్యూటర్ బేస్డ్ ఫోన్ ​కాల్స్ ద్వారా ఆ పథకం వల్ల ప్రయోజనం.. సూచనలు స్వీకరించాలని నిర్ణయించారు. లబ్ది దారులు ఇచ్చే రేటింగ్ ఆధారంగా సర్కార్ మార్పులు చేర్పులు చేయనున్నారు. పథకాలతో పాటుగా ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న పాలనా పరమైన నిర్ణయాల పైనా ప్రజాభిప్రాయం సేకరించనున్నారు. ముఖ్యంగా ఉచిత ఇసుక..నూతన మద్యం పాలసీ తో పాటుగా మద్యం అమ్మకాలపైనా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించాలని నిర్ణయించారు. అదే విధంగా ప్రజలతో నేరుగా మమేకం అయ్యే పౌర సేవల పైనా ఇదే విధానం అమలు చేయనున్నారు.

గత అనుభవాలతో
ప్రజలు నిత్యం వినియోగించుకునే రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్ వంటి పలు కీలక శాఖల నుంచి అందుతున్న సేవల పైనా ప్రజాభిప్రాయం సేకరించనున్నారు. వీటి పైన ప్రజలు ఇంకా ఎలాంటి మార్పు కోరుకుంటున్నారు.. ఏ మార్పులు చేయాలనేది సూచనలు స్వీకరించనున్నారు. దీని ద్వారా అవసరమైన మార్పులు చేసి సేవల్లో నాణ్యత పెంచాలని భావిస్తున్నారు. నాణ్యమైన ప్రభుత్వ సేవలు అందించే కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని చంద్రబాబు కోరుతున్నారు. గతంలో ఇలాంటి ప్రయోగం చేసినా..అధికారులు మెప్పు కోసం ఇచ్చిన సమాచారం తో నష్టం జరగటంతో ఈ సారి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+