ఏపీలో చంద్రబాబు కొత్త పథకం.. లబ్ధిదారులకు నెలకు రూ.15వేలు?
తెలుగుదేశం-జనసేన-బీజేపీ ఆధ్వర్యంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే) ప్రభుత్వం ఏపీలో అధికారాన్ని చేజిక్కించుకుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన లోటుపాట్లను సరిచేస్తున్నారు. తాజాగా పింఛను రూ.వెయ్యి పెంచడంతోపాటు రూ.4వేలకు తోడు మూడు నెలల ఎరియర్స్ రూ.3వేలు కలిపి రూ.7వేలు అందించారు. రాజధాని పరిధిలోని పెనుమాక గ్రామంలో లబ్ధిదారుల నివాసానికి వెళ్లి చంద్రబాబు స్వయంగా పింఛను అందించారు.
కీలక ప్రకటన చేసిన ప్రభుత్వం
ఈ తరుణంలోనే పింఛన్ల పంపిణీకి ముందు ప్రభుత్వం కీలకమైన ప్రకటన చేసింది. రూ.15వేల పింఛను స్కీంపై అప్ డేట్ ఇచ్చింది. మంచం పట్టి లేవలేని స్థితిలో ఉన్నవారికి కూడా త్వరలో పింఛను అందించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. సింగిల్ ఉమెన్, ట్రడిషనల్ కోబ్లర్స్, ట్రాన్స్‌జెండర్స్, ఓల్డ్ ఏజ్ పెన్షన్, వితంతువులు, టోడీ తప్పర్స్, డప్పు ఆర్టిస్ట్, చేతివృత్తులు, ఫిషర్‌మెన్, ఏఆర్‌టీ (పీఎల్‌హెచ్ఐవీ) వారికి గతంలో రూ.3వేలు ఇచ్చేవారు. ఇకనుంచి వారి పింఛనును రూ.4వేలకు పెంచారు. అంటే వీరికి రూ.వెయ్యి పెరిగింది.

రెండురెట్లు పెరిగిన పింఛను
మల్టిడిఫార్మిటీ లెప్రసీ, దివ్యాంగుల పింఛను కూడా పెరిగింది. గతంలో వీరికి రూ.3వేలు రాగా దాన్ని చంద్రబాబు ప్రభుత్వం రూ.6వేలకు పెంచింది. వీరికి రెట్టింపు పెరిగింది. పూర్తిస్థాయి దివ్యాంగులకు నెలకు రూ.15వేలు వస్తోంది. పక్షవాతం వచ్చి మంచంపై లేదంటే చక్రాల కుర్చీకి పరిమితమైనవారికి కూడా రూ.15వేలు వస్తోంది. ప్రమాదాల్లో బాధితులు, మస్కులర్ డిస్ట్రోఫీ కేసులవారికి కూడా రూ.15వేలు ఇస్తున్నారు. గతంలో వీరికి రూ.5వేలు మాత్రమే ఇచ్చేవారు. వీరికి రెండురెట్లు పెరిగింది. హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్, లివర్, కిడ్నీ వారికి గతంలో రూ.5వేలు రాగా ఇకనుంచి రూ.10వేలు వస్తుంది. అలాగే క్రోనిక్ డిసీజ్ ఉన్నవారికి రూ.10వేలు ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications