ఏపీలో దీపావళి నుంచి 3 ఉచిత సిలిండర్లు.. వెంటనే ఈపని చేయండి

ఎన్నికల సమయంలో అప్పటి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అనేక హామీలను ప్రకటించారు. అందులో ప్రధానమైనవి సూపర్ సిక్స్. వీటిల్లో ఒకటి ఏమిటంటే.. మహిళలకు ఏడాదికి ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తారు. అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఈ పథకాన్ని అమలు చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఇటీవలే చంద్రబాబు దీపావళి నుంచి ఈ పథకాన్ని అమలు చేయబోతున్నట్లు స్వయంగా ప్రకటించారు.

దీపావళి నుంచి వర్తిస్తుంది.
దీంతో అధికారులు కసరత్తులు ప్రారంభించి రాష్ట్రవ్యాప్తంగా 1.30 కోట్ల తెల్ల రేషన్ కార్డులు ఉన్నట్లు నివేదించారు. త్వరలోనే విధివిధానాలను, మార్గదర్శకాలను ప్రకటించబోతున్నారు. రాష్ట్రంలో చాలామంది మహిళలు తమపేర్ల మీద ఉన్న గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఈకేవైసీ చేయించుకోలేదని అధికారులు గుర్తించారు. వెంటనే వీరంతా ఈకేవైసీ చేయించుకోవాలని, లేదంటే పథకానికి అనర్హులవుతారని చెప్పారు. ఈ కేవైసీ చేయించుకున్నవారికే దీపావళి నుంచి మూడు సిలిండర్ల పథకం వర్తిస్తుంది.

ap government will implement three free gas cylinder scheme ekyc must

ఈకేవైసీ చేయించుకోవడం తప్పనిసరి
ప్రతి వినియోగదారులు తాను ఎక్కడినుంచైతే గ్యాస్ ను పొందుతున్నాడో సంబంధిత డీలర్ దగ్గరకు వెళ్లి ఈకేవైసీ చేయించుకోవాలి. ఆధార్ నెంబరు ఇచ్చి వేలిముద్ర వేస్తే సరిపోతుంది. వెంటనే అప్ డేట్ అవుతుంది. ఒకవేళ ఈకేవైసీ చేయించుకోవడంలో తాత్సారం చేస్తే కనెక్షన్ రద్దవుతుందని గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు చెబుతున్నారు. ఇంటికి ఒక పథకాన్నే వర్తింపచేస్తారు. మూడు ఉచిత సిలిండర్ల పథకం ఏపీకి పొరుగునే ఉన్న కర్ణాటక, తెలంగాణలో కూడా అమలవుతున్నాయి. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో పథకం అమలవుతున్న తీరుతెన్నులపై అధికారులు అధ్యయనం చేశారు. దీనికి అనుగుణంగా విధివిధానాలు రూపొందించబోతున్నారు. త్వరలోనే మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఈలోగా వినియోగదారులు ఈకేవైసీ చేయించుకోవడం తప్పనిసరి. ఆడబిడ్డ నిధి, ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ పథకాలను కూడా త్వరలోనే ప్రారంభించబోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+