వివేకా కేసులో కొత్త మలుపు - వాంగ్మూలం తప్పుగా రికార్డు, హైకోర్టులో పిటీషన్..!!

వైఎస్ వివేకా కేసులో కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. సీబీఐ ఛార్జ్ షీట్ లో తన వాంగ్మూలాన్ని తప్పుగా రికార్డు చేసిందని ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం తెలంగాణ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. సీబీఐ స్టేట్ మెంట్ పైన అభ్యంతరం వ్యక్తం చేసారు. అసత్యాలను ఏర్చికూర్చి పెట్టిందని పేర్కొన్నారు. సీబీఐ చార్జ్ షీట్ లో తన స్టేట్ మెంట్ కొట్టివేయాలని కోరారు. దీని పైన సోమవారం న్యాయస్థానం నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

అజయ్ కల్లాం సీబీఐకి స్టేట్ మెంట్ : వివేకా హత్య కేసులో అజయ్ కల్లాం సీబీఐకి స్టేట్ మెంట్ ఇచ్చారు. అందులో..ఏప్రిల్ 29న తానే వాంగ్మూలం ఇస్తుండగా, అధికారి మరొకరిని లోపలికి పిలిచారు. ఆయన ల్యాప్ టాప్ తో వచ్చి ఏదో రికార్డు చేసుకున్నారు. ఆయన ఏం రికార్డు చేసిందీ తనకు చూపించలేదని కల్లం పేర్కొన్నారు. కనీసం చదవి వినిపించలేదన్నారు.

 ys-viveka

తన వాంగ్మూలాన్ని ఆడియో, వీడియో రికార్డు కూడా చేయలేదని చెప్పుకొచ్చారు. సీబీఐ తన స్టేట్ మెంట్ ను తప్పుడు రికార్డు చేసినట్లు మే 17న ఓ పత్రికలో ప్రచురితమైన వార్త ద్వారా తెలుసుకేన్నట్లు పేర్కొన్నారు. తన వాంగ్మూలం పై సంతకం చేసిన అధికారి, తనను విచారించిన అధికారిక ఒకరు కాదని అజయ్ కల్లాం స్పష్టం చేసారు.

ఛార్జ్ షీటులో మరోలా : తాను చెప్పింది ఒకటయితే, సీబీఐ దాన్ని మార్చి ఛార్జ్ షీటులో మరోలా పేర్కొందని వివరించారు. మార్చి 15,2019న జగన్ నివాసంలో ఉదయం 5 గంటల సమయంలో మేనిఫెస్టోపై సమావేశం ప్రారంభమైందని .. సుమారు గంటన్నార తరువాత అటెండర్ వచ్చి డోరు కొట్టారన్నారు. ఓఎస్డీ క్రిష్ణ మోహన్ రెడ్డి బయటకు వెళ్లి, తిరిగి వచ్చి జగన కు ఏదో విషయం చెప్పారని గుర్తు చేసారు.

వెంటనే జగన్ షాక్ కు గురయ్యారని పేర్కొన్నారు. చిన్నాన్న చనిపోయారని తమతో అన్నారని, ఇంతకు మించి తానేమీ సీబీఐకి చెప్పలేదని అజయ్ కల్లం స్పష్టం చేసారు. అయితే, సీబీఐ పేర్కొన్న స్టేట్ మెంట్ లో తనకు ఆపాదించి, తాను చెప్పినట్లుగా అబద్దాలను చేర్చారని అజయ్ కల్లం కోర్టులో దాఖలు చేసిన పిటీషన్ లో పేర్కొన్నారు.

telangahighcourt1

హైకోర్టులో పిటీషన్ : ఛార్జ్ షీట్ లో సీబీఐ పేర్కొన్నది పూర్తిగా అసంబద్దమైనదిగా అజయ్ కల్లం వివరించారు. దర్యాప్తును తప్పుదారి పట్టించి, ఇతరులను కేసులో ఇరికంచే ధరణితోనే సీబీఐ తప్పుడు వాంగ్మూలాన్ని సమర్పించటం సరికాదని పేర్కొన్నారు. ఇతర వ్యక్తులను చిక్కుల్లో పడేసేందుకే సీబీఐ తప్పుడు సమాచారం చేర్చిందన్నారు.

ఈ అంశాలను పరిశీలించి హైదరాబాద్ సీబీఐ కోర్టులో సమర్పించిన ఛార్జిషీట్ నుంచి తప్పుడు వాంగ్మూలాన్ని తొలిగించాలని..ఈ మేరకు ఆదేశాలు ఇవ్వాలని అజయ్ కల్లం కోర్టును కోరారు. ఈ పిటీషన్ లో సీబీఐ డైరెక్టర్, వివేకా కేసు విచారణాధికారి ని ప్రతివాదులుగా చేర్చారు. సోమవారం దీని పైన కోర్టు నిర్ణయం వెలువరించే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+