ఏపీలో వచ్చే ఎన్నికల్లో 2019 కంటే రీసౌండ్ విక్టరీ..!!
2019 కంటే ఈ సారి మరింత రీసౌండ్ విక్టరీ వస్తుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. జగన్ సంక్షేమ పాలన చూసి ప్రతిపక్షాలు కడుపుమంటతో రగిలిపోతున్నాయని చెప్పుకొచ్చారు. 20019 ఇదే రోజున కోట్లాది ప్రజల ఆకాంక్షలను నిజం చేస్తూ ఎన్నికల ఫలితాలు వచ్చాయని గుర్తు చేసారు. అసలైన రాజకీయ పార్టీకి, రాజకీయ నాయకులకు ఉండాల్సిన లక్షణాలు సీఎం వైయస్ జగన్ చేసి చూపించారని సజ్జల వివరించారు.

ఇచ్చిన హామీలను 98.5% అమలు చేసి చూపించామని సజ్జల చెప్పుకొచ్చారు. అవినీతికి వ్యతిరేకంగా, పారదర్శకంగా అభివృద్ధి, సంక్షేమం అమలు చేస్తున్నామన్నారు. బందరు పోర్టు శంకుస్థాపన మరో మైలురాయిగా పేర్కొన్నారు. వచ్చే ఏడాది రామాయపట్నం పోర్టు ప్రారంభం అవుతుందని చెప్పారు. నిజమైన అభివృద్ధి ఎలా ఉంటుందో ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏపీ పాలనను మెచ్చుకుంటున్నాయని సజ్జల వివరించారు. పాలనా వికేంద్రీకరణ జరిగిదని చెప్పారు.

రాష్ట్రానికి రావాల్సిన నిధులు మనం సాధించగలిగామని సజ్జల వివరించారు. నాడు చంద్రబాబు చేయలేని పనిని సీఎం జగన్ చేసిన చూపించారని పేర్కొన్నారు. బీజేపీతో భాగస్వామిగా ఉండి కూడా చంద్రబాబు ఏమీ చేయలేదన్నారు. నాడు తమ వ్యక్తిగత పనులకు ప్రాధాన్యత ఇచ్చారు కానీ, రాష్ట్రానికి ఉపయోగపడే పని చేయలేదని దుయ్యబట్టారు. అవినాష్ రెడ్డి వ్యవహారం కోర్టులో ఉందన్నారు. న తల్లి అనారోగ్యంతో ఉండటంతో అవినాష్ విచారణకు హాజరుకాలేదు. ఆ విషయాన్ని సీబీఐకి కూడా తెలిపారు. ఇప్పటికే అవినాష్ రెడ్డి ఆరుసార్లు విచారణకు హాజరయ్యారు. కేంద్ర బలగాలు వస్తున్నాయని అసత్య కథనాలు రాశారు. మళ్ళీ రాకుండా అడ్డుకున్నారంటూ రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.
రామోజీరావు కేసులో ఏ కోర్టుకైనా వెళ్లొచ్చా? అవినాష్ వెళ్తే ఎలా తప్పు అవుతుందని సజ్జల ప్రశ్నించారు. తన తల్లి అనారోగ్యం గురించి సీబీఐకి కూడా అవినాశ్ తెలిపారని వివరించారు. ఎంపీ ఏమైనా దోషా అని ప్రశ్నించిన సజ్జల శిక్ష పడితే పారిపోతున్నారా అని ప్రశ్నించారు. రామోజీ రావుకు, చంద్రబాబుకు ఒక న్యాయం... అవినాష్‌కు మరో న్యాయమా అని నిలదీసారు. రాష్ట్రంలో ఏదో జరిగి పోతుందని భ్రమ కల్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇప్పటికే 95 శాతం పైగా హామలు అమలు చేసామని..వచ్చే ఎన్నికల్లో రీసౌండ్ విక్టరీ సాధిస్తామని సజ్జల ధీమా వ్యక్తం చేసారు.












Click it and Unblock the Notifications