Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'తల్లికి వందనం'లో కోత, అర్హులు వీరే- నిబంధనలు..!!

ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలు పై కసరత్తు ప్రారంభించింది. లబ్దిదారులు.. ఆర్దిక భారం పైన లెక్కలు సిద్దం చేస్తోంది. తాము అధికారంలోకి వస్తే బడికి వెళ్లే ప్రతీ విద్యార్ధి తల్లి ఖాతా లో రూ 15 వేలు చొప్పున జమ చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. తాజాగా ఈ పథకం వచ్చే విద్య సంవత్సరం నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. దీంతో, లబ్దిదారులకు ఒక ఏడాది పథకం అమలు కానట్లే. అదే సమయంలో కూటమి ప్రభుత్వం ఈ పథకం అమలుకు సంబంధించిన నిబంధనలను ఖరారు చేసింది.

అమలు పై కసరత్తు
వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన అమ్మ ఒడి పథకానికి కూటమి ప్రభుత్వం తల్లికి వందనంగా పేరు మార్పు చేసింది. వైసీపీ ప్రభుత్వం రూ 15 వేలు ఇస్తామని చెప్పి పాఠశాలల నిర్వహణ పేరుతో కోత వేసి తొలుత రూ 14 వేలు, ఆ తరువాత రూ 13 వేలు చొప్పున అమలు చేసింది. కూటమి పార్టీ ల నేతలు తాము అధికారంలోకి వస్తే ఎలాంటి కోతలు లేకుండా ఎంత మంది పిల్లలు ఉంటే అం త మందికి వారి తల్లుల ఖాతాల్లో రూ 15 వేలు జమ చేస్తామని హామీ ఇచ్చారు. జూన్ లో కొలువు తీరిన కూటమి ప్రభుత్వం ఈ పథకం పైన తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. 2024 లో పథకం అమలు చేయకుండా 2025 జూన్ లో అమలు చేయాలని డిసైడ్ అయింది.

AP Govt almost finalised the Guidelines for Ammavodi Scheme to be implement in June month

ఖర్చు - లెక్కలు
ఈ ఏడాది జూన్ లో విద్యా సంవత్సరం ప్రారంభం సమయంలో ఈ పథకం కింద అర్హులైన తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయనుంది. దీంతో, ఇక నుంచి ప్రతీ ఏటా అమలు చేసినా.. నాలుగేళ్లే ఈ పథకం అమలు కానుంది. లబ్ది దారులకు ఒక ఏడాది నిధులు కోత పడనున్నాయి. 2024-25 విద్యాసంవత్సరంలో రాష్ట్రంలో దాదాపు 81 లక్షల మంది విద్యార్ధులు చదువుతున్నారు. అయితే ఇందులో ప్రాధమికంగా 69.16లక్షల మంది ఈ పథకానికి అర్హులుగా విద్యాశాఖ తేల్చిన్నట్లు సమాచారం. ఇక, ఈ పథకం అమలు కోసం దాదాపు రూ 10,300 కోట్లు అవసరమని అధికారులు ప్రాధమికంగా అంచనాకు వచ్చారు. ఇదే సమయంలో విద్యార్ధులకు 75 శాతం హాజరు నిబంధన కొనసాగనుంది. 2025-26 బడ్జెట్‌లో ఈ పథకానికి నిధులు కేటాయింపులో భాగంగా ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు.

విధి విధానాలు
ఈ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాల పైన అధ్యయనం కొనసాగుతోంది. గతంలో వైసీపీ ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ను సమీక్షిస్తున్నారు. ఆదాయ పన్ను చెల్లింపు దారులు..తెల్లరేషన్‌ కార్డు లేనివారిని, 300 యూనిట్ల విద్యుత్‌ వినియోగించేవారిని, కారు కలిగి ఉన్న వారిని, అర్బన్‌ ప్రాంతంలో 1000 చదరపు అడుగులు కలిగి ఉన్నవారికి పథకం అందటం లేదు. ఇక, ఇప్పుడు కొత్త నిబంధనలను అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది. విద్యుత్ వినియో గం, కారు ఉండటం వంటి నిబంధనలను గతంలో వ్యతిరేకించిన కూటమి నేతలు ఇప్పుడు మినహాయింపు ఇస్తారా.. లేక, కొనసాగిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. దీంతో.. తల్లికి వందనం నిధులు జూన్ లో జమ అవుతాయని స్పష్టత వచ్చినా.. అర్హత, మార్గదర్శకాల పైన లబ్ది దారుల్లో ఉత్కంఠ పెరుగుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+