వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో కరోనా రెడ్ జోన్ల ప్రకటన- 133 ప్రాంతాల్లో ఇక ఆంక్షలు మరింత కఠినం..

|
Google Oneindia TeluguNews

ఏపీలో కరోనా వైరస్ పరిస్ధితిపై ప్రభుత్వానికి ఇవాళ మరింత స్పష్టృత వచ్చింది. తాజాగా నిర్వహిస్తున్న మూడో విడత సర్వే తర్వాత రాష్ట్రంలో 133 ప్రాంతాలను రెడ్ జోన్లుగా గుర్తిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో రేపటి నుంచి మరిన్ని ఆంక్షలతో పాటు కఠినమైన నిఘా అమల్లోకి రానుంది.

ఏపీలో రెడ్ జోన్ల ప్రకటన...

ఏపీలోని 13 జిల్లాల పరిధిలో ప్రస్తుతం 11 జిల్లాల్లోనే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆయా జిల్లాల్లోని 133 ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 30 రెడ్ జోన్లు ఉండగా.. అత్యల్పంగా అనంతపురం జిల్లాలో మూడు రెడ్ జోన్లు ఉన్నాయి. ఇక టాప్ రెడ్ జోన్ల సంఖ్య అధికంగా ఉన్న జిల్లాల్లో నెల్లూరు తర్వాత కర్నూలు (22), కృష్ణా (16), గుంటూరు (12) ప్రకాశం (11) ఉన్నాయి.

ap govt announces 133 areas as red zones across the state

రెడ్ జోన్లు, బఫర్ జోన్లు...

కరోనా వైరస్ పాజిటివ్ పేషెంట్లు ఉన్న చోటు నుంచి మూడు కిలోమీటర్ల దూరాన్ని రెడ్ జోన్ గానూ, ఐదు కిలోమీటర్ల పరిధిని బఫర్ జోన్ గానూ ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే బఫర్ జోన్ల పరిధి 7 కిలోమీటర్లుగా నిర్ణయించారు. ఆయా ప్రాంతాల ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద ధర్మల్ స్క్రీనింగ్ నిర్వహణతో పాటు వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించారు. కంటైన్ మెంట్‌ జోన్లను అనుసంధానించే అన్ని రహదారులూ పోలీసుల పర్యవేక్షణలో ఉంటాయి. కరోనా రోగులపై ఆశావర్కర్లతో పాటు స్ధానిక వైద్యాధికారి పూర్తిగా నిఘా పెడతారు.

English summary
andhra pradesh govt announced 133 areas across the state as coronavirus red zones. govt will impose more restrictions in red zones and closely monitor the situation in the areas with separate staff.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X