ఈడబ్య్లూఎస్ ఉద్యోగ అభ్యర్ధులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..!!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈడబ్య్లూఎస్ వర్గాలకు చెందిన ఉద్యోగ అభ్యర్థులకు శుభవార్త చెప్పింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈడబ్య్లూఎస్ వర్గాలకు చెందిన ఉద్యోగ అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగాల భర్తీలో బీసీ,ఎస్పీ,ఎస్టీల మాదిరిగానే ఆర్థికంగా వెనుకబడిన ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు వయోపరిమితిని ఐదేళ్లు పెంచారు. ఈ మేరకు సబార్డినేట్స్‌ సర్వీస్‌ రూల్స్‌ను సవరించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ప్రస్తుతం ఉన్న 34 ఏళ్ల వయసు ను 39 ఏళ్ల వరకు పొడిగించారు. ఇకపై ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి 39 ఏళ్లవరకు దరఖాస్తు చేసుకొనే అవకాశం ఈడబ్య్లూఎస్ ఉద్యోగ అభ్యర్ధులకు లభించింది.

ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీయేతర వర్గాలకు చెందిన ఈడబ్ల్యూఎస్‌ వర్గాల అభ్యర్థులకు వర్తిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఈడబ్య్లూఎస్ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీం కోర్టు ధర్మాసనం ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాల ఈడబ్ల్యూఎస్ కు పది శాతం రిజర్వేషన్లు కేటాయించడం సమంజసమేనంటూ గతంలోనే తీర్పు ప్రకటించింది. ఈ కోటాను అమలు చేయడం రాష్ట్రాల ఇష్టం అని కేంద్రం సుప్రీం కోర్టుకు నివేదించింది. కేంద్రం సూచించిన ప్రాతిపదికనే చాలా రాష్ట్రాలు అమలు చేశాయి. ఇంతకముందు ఈడబ్య్లూఎస్ వర్గాలకు చెందిన అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగాల కోసం గరిష్ట వయోపరిమితి 34 సంవత్సరాలుగా ఉండేది. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వారికి కూడా వెసులుబాటు కలగనుంది.

AP Govt Announces Five years Age Relaxation for EWS Candidates in Jobs, Release latest orders

కేంద్రం తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు విషయంలో నిర్ణయాధికారం రాష్ట్రాలదే అని కేంద్రం కొద్ది రోజుల క్రితం పార్లమెంట్ లో స్పష్టం చేసింది. ఇక..ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో ఎవరికి ఏ మేర రిజర్వేషన్ కేటాయించాలనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంగా కేంద్రం పేర్కొంది. రాష్ట్రంలో కొంత కాలంగా ఇదే అంశం పైన రాజకీయంగా చర్చ సాగుతోంది. కాపులకు అయిదు శాతం రిజర్వేషన్ల పైన గత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటంతో..ఇప్పుడు ఆ నిర్ణయం అమలు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. దీని పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇక.. ఇప్పుడు ప్రభుత్వం ఈడబ్య్లూఎస్ వర్గాలకు చెందిన ఉద్యోగ అభ్యర్థులకు మేలు చేసేలా నిర్ణయం తీసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+