మండలి విప్ లుగా ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలు - ఒకే జిల్లా నుంచి..!!
ఏపీ శాసనమండిలో ఇద్దరు విప్ లను నియమిస్తూ గజెట్ జారీ అయింది. అధికార వైసీపికి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు విప్ లుగా నియమితులయ్యారు. ఎమ్మెల్సీలు జంగా కృష్ణమూర్తి, డొక్కా మాణిక్య వర ప్రసాద్‌లకు ముఖ్యమంత్రి అవకాశం కల్పించారు. ఇద్దరూ గుంటూరు జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇద్దరూ తొలుత కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన నేతలే. జంగా కృష్ణమూర్తి వైసీపీలో జగన్ పాదయాత్ర సమయంలో బీసీ సంక్షేమం పైన చేసిన కమిటీని లీడ్ చేసారు.
బీసీ వర్గాలకు సంబంధించిన అంశాలను పర్యవేక్షించారు. బీసీ గర్జన ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. వైఎస్సార్ హయాంలో గురజాల నుంచి ఎమ్మెల్యేగా వ్యవహరించారు. గత ఎన్నికల్లో టిక్కెట్ ఆశించినా.. అక్కడ కాసు మహేష్ రెడ్డికి పార్టీ అధినేత హామీ ఇచ్చారు. దీంతో..జంగాకు ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది. మరో నేత డొక్కా వైఎస్సార్ హయాంలో తాడికొండ నుంచి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగానూ పని చేసారు. టీడీపీ నుంచి 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.

ఆ తరువాత మూడు రాజధానులకు మద్దతు ఇస్తూ వైసీపీలో చేరారు. కొద్ది రోజులకే ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది. సీనియార్టీ.. సామాజిక సమీకరణాలు పరిగణలోకి తీసుకున్న సీఎం జగన్ ఎస్సీ - బీసీ వర్గాలకు చెందిన ఈ ఇద్దరికీ ప్రభుత్వ విప్ లుగా ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ తొలి వారం నుంచి ఏపీ అసెంబ్లీ - మండలి సమావేశాలు జరగనున్నాయి. శాసన మండలి ఛైర్మన్ గా ఎస్సీ వర్గానికి అవకాశం ఇవ్వగా.. డిప్యూటీ ఛైర్మన్ గా మైనార్టీ మహిళకు ఛాన్స్ దక్కింది.












Click it and Unblock the Notifications