సచివాలయ ఉద్యోగుల ప్రక్షాళన - తాజా ఉత్తర్వులతో..!!
ఏపీ ప్రభుత్వం పాలనా పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అధికారుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రభుత్వం మారిన తరువాత వైసీపీ అనుకూల ధోరణితో వ్యవహరిస్తున్న అధికారుల పై చర్యలు ప్రారంభించింది. ప్రస్తుత ప్రభుత్వంలో వైసీపీ కోవర్టులుగా కొందరు వ్యవహరిస్తున్నారనే అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు ఏపీ సచివాలయంలో ప్రక్షాళన దిశగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ప్రక్షాళన
ఏపీ పాలనా కేంద్రం సచివాలయంలో ప్రభుత్వం ప్రక్షాళన ప్రారంభించింది. వైసీపీ పాలనలో కీలక శాఖల్లో ముఖ్య హోదాల్లో ఉన్న ఉద్యోగులకు స్థాన చలనం మొదలైంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత కొన్ని శాఖల్లో వైసీపీ కోవర్టులు పని చేస్తున్నారనే అభిప్రాయం కొందరు మంత్రులు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ పలువురు మంత్రులు ఈ సందేహం వ్యక్తం చేసారు. దీంతో, ఇలాంటి వారు ఉంటే గుర్తించి చర్యలు తీసుకోవాలని సీఎస్ ను ప్రభుత్వం ఆదేశించింది.

ఉత్తర్వులు
దీంతో, సచివాలయంలో శాఖల వారీగా సీఎస్ నివేదికలు కోరారు. సుదీర్ఘ కాలంలో ముఖ్య శాఖల్లో కీలక హోదాలో కొనసాగుతున్న వారి సమాచారం సేకరించారు. ప్రభుత్వంలోని ముఖ్యులు సందేహాల నేపథ్యం లో సుదీర్ఘ కాలంగా కీలక హోదాల్లో కొనసాగుతన్న వారిని స్థాన చలనం చేస్తూ నిర్ణయించారు. అందులో భాగంగా ముఖ్య శాఖలకు సంబంధించి 13 మందిని వారి ప్రస్తుత స్థానాల నుంచి మార్పు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేసారు. అందులో ఆరుగురిని జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశించారు.
కసరత్తు
తాజాగా ఆర్దిక శాఖలో బిల్లుల చెల్లింపు విషయం పైన ప్రభుత్వంలో చర్చ జరిగింది. మంత్రికి తెలియకుండానే వైసీపీ హాయంలో పనులు చేసిన పులివెందుల కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారు. ఆర్దిక మంత్రి పయ్యావుల జిల్లా పర్యటనలో ఉన్న సమయంలో ఈ బిల్లులు క్లియర్ అయ్యాయి. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంటే గతంలో తమ హయాంలో పనులు చేసిన వారి బిల్లులు పెండింగ్ లో ఉండగానే వైసీపీ ప్రభుత్వంలో పనులు చేసిన వారికి చెల్లింపు వ్యవహారం కలకలం రేపింది. దీంతో, మొత్తంగా అధికారులు..ఉద్యోగుల పని తీరు..వ్యవస్థ పైన ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది.












Click it and Unblock the Notifications