వరద బాధితుల ఖాతాల్లో పరిహారం జమ..!!
వరదలతో నష్టపోయిన బాధితులకు హ్యాపీ ప్రభుత్వం పరిహారం చెల్లింపు ప్రారంభించింది. ఇప్పటికే వరద బాధితుల కోసం ప్రత్యేకంగా ఆర్థిక ప్యాకేజీని ముఖ్యమంత్రి ప్రకటించారు. దాదాపు రూ 600 కోట్ల మేర ఈ ప్యాకేజీ నేరుగా బాధితుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేలా నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి వారి ఖాతాల్లో నగదు జమ కానుంది.
రాష్ట్రంలో అకాల వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. దాదాపు లక్ష్మీనారాయణ అంది విజయవాడ నగరంలోని వరద ముంపు బారిన పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా వరద బాధితుల సంఖ్య దాదాపు నాలుగు లక్షల మంది. వీరికి అండగా నిలిచేందుకు ప్రభుత్వం సుమారు రూ 600 కోట్ల మీర ప్యాకేజీ ప్రకటించింది. వరదల్లో మునిగిన నివాసాలతో పాటుగా దుకాణాలు, తోపుడు బండ్లు, వ్యాపారాలు, చిన్న తరహా పరిశ్రమలు, పంటలు, వాహనాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది.

బాధితులకు సంబంధించి సమాచారం ఇప్పటికే ప్రభుత్వం సేకరించింది. ఇప్పుడు ప్రకటించిన పరిహారాన్ని నేరుగా బాధితుల బ్యాంకు ఖాతాల్లో డిబీటి విధానంలో జమ చేయనుంది. విజయవాడ పరిధిలోని వరద ముంపు బాధితులకు నేటి నుంచి బ్యాంకు ఖాతాల్లో నగదు జమవుతుందని అధికారులు వెల్లడించారు.
వరదల్లో గ్రౌండ్ ఫ్లోర్ మునిగిన వారికి రూ 25000 నగదు సాయం ప్రభుత్వం ఇవ్వనుంది. మొదటి, ఆపై అంతస్తులో ఉండే వారికి రూ 10,000 నగదు జమకానుంది. దుకాణాలు ధ్వంసం అయిన వారికి 25 వేలు, పంటలకు హెక్టారుకు రూ 25 వేల చొప్పున పరిహారం అందించనుంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో నష్టపోయిన ఇళ్లకు రూపు పదివేల చొప్పున ప్రభుత్వం అందించనుంది. నష్టపోయిన ప్రతి ఒక్కరికి పరిహారం అందుతుందని అధికారులు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications