జగన్ ముద్ర తొలిగించేలా కొత్త ప్రభుత్వం తొలి నిర్ణయం..!!

ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. 25 మంది మంత్రులతో కలిసి చంద్రబాబు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసారు. ఎన్నికల్లో వైసీపీ ఓటమ తరువాత కొత్త ప్రబుత్వం బాధ్యతలకు ముందే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పుడు ప్రమాణ స్వీకారం పూర్తి కావటంతో అధికారికంగా అమలుకు సిద్దం అవుతోంది. ఇక..మంత్రుల శాఖలను ప్రకటించిన తరువాత పూర్తి స్థాయి పాలన ప్రారంభం కానుంది. జగన్ ప్రచారం కోసం తీసుకున్న నిర్ణయాల్లో మార్పులు చేస్తున్నారు.

ఏపీలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైంది. పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. జగన్ ప్రభుత్వంలో ప్రతీ ఏటా విద్యా కానుకతో పాటుగా ప్రతీ రోజు పాఠశాలల్లో మధ్నాహ్న భోజన పథకం అమలు చేసేవారు. అప్పటి వరకు ఉన్న ఈ పథకంలో కొన్ని మార్పులు చేసారు. ఉదయం బడికి వచ్చిన విద్యార్ధులకు రాగిజావ, మధ్నాహ్నం నిర్ధేశిత మెనూతో సిద్దం చేసిన భోజనం..విద్యార్ధులకు చిక్కీలు అందించే వారు. ఆ చిక్కీల పైన జగన్ ఫొటోలతో ఉన్న కవర్ తో విద్యార్ధులు అందిస్తూ వచ్చారు. ఇప్పుడు తిరిగి పాఠశాలలు ప్రారంభం కావటంతో విద్యా కానుకను గత ప్రభుత్వంలో సిద్దం చేయటంతో..యధావిధిగా అమలు చేయాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించింది.

AP govt chancged the mid day meals programme in the schools as Reports

అదే సమయంలో బడులకు చిక్కీలతో పాటుగా కోడిగుడ్లు, రాగిపిండి సరఫరా చేస్తున్నారు. గతంలో చిక్కీల పై జగన్ ఫొటో కవర్లను ఏర్పాటు చేయగా..ప్రస్తుతం వాటిని తొలించారు. వాటి స్థానంలో రాజముద్రతో కవర్లు రూపించారు. మధ్నాహ్న భోజనం పథకాన్ని గోరుముద్దగా మార్పు చేసారు. అదే విధంగా.. ప్రతీ ఏటా జగన్ ప్రభుత్వ హయాంలో అమ్మఒడి అమలు చేసేవారు. తాము అధికారంలోకి వస్తే అమ్మకు వందనం పేరుతో ప్రతీ ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ అమ్మకు వందనం కింద రూ 15 వేలు చొప్పున అందిస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. దీంతో..ఇప్పుడు కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావటంతో గత ప్రభుత్వ హాయంలో ప్రచారం కోసం తీసుకున్న నిర్ణయాల్లో మార్పులు చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+