వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మత్స్యకారుల ఖాతాల్లో నిధులు జమ చేసేందుకు తుది కసరత్తు చేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మత్స్యకారుల సేవలో పథకం పేరుతో ఆర్దిక సాయం అందిస్తోంది. గత ఏడాది ఈ మేరకు నిధులు విడుదల చేసారు. కాగా, ఈ ఏడాదికి సంబంధించి అర్హుల ఖరారు ప్రక్రియ పైన మార్గదర్శకాలు జారీ అయ్యాయి. లబ్ది దారుల ఎంపిక పైన కసరత్తు కొనసాగుతోంది.

ఏపీ ప్రభుత్వం మత్స్యకారులకు ఆర్దిక సాయం అందించేందుకు సిద్దమైంది. గత ప్రభుత్వంలో మత్య్సకారులకు ఇచ్చే ఆర్దిక ప్రయోజనం పెంచి కూటమి ప్రభుత్వం మత్య్సకారుల సేవలో పేరు తో పథకం అమలు చేస్తోంది. అందులో భాగంగా ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అర్హత కలిగిన మత్స్యకారులకు చేపల వేట నిషేధం సమయంలో ప్రతీ ఏడాది రూ.20 వేల ఆర్ధిక సాయం అందిస్తున్నారు. ఈ ఏడాదికి సంబంధించి లబ్దిదారుల ఎంపికను షురూ చేశారు. ప్రస్తుతం అర్హులైనవారి వివరాలను సేకరిస్తున్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి అర్హుల వివరాలను సేకరించి లబ్దిదారుల జాబితా సిద్దం చేయనున్నారు. అనంతరం వారి అకౌంట్లలో ప్రభుత్వం నిధులు వేయనుంది.

ap-govt-decided-to-deposit-rs-20000-in-eligible-fishermen-accounts-as-implementation-of-matsykara-s

వేట నిషేధ సమయంలో ఖాతాల్లో రూ 20 వేలు

కాగా, ప్రభుత్వం మత్స్యకారులకు చేపల వేటపై నిషేధం విధించింది. ఈ నెల 15వ తేదీ నుంచి నిషేధం అమల్లోకి రానుందని తెలిపింది. జూన్14వ తేదీ వరకు మొత్తం 61 రోజుల పాటు నిషేధం అమల్లోకి ఉండదనుందని స్పష్టం చేసింది. ఈ సమయంలో మత్స్యకారులు చేపల వేటకు వెళితే కఠిన చర్యలు తీసుకుంటారు. ఏప్రిల్ నుంచి మూడు నెలల పాటు సముద్రంలో చేపల వృద్ది జరుగుతూ ఉంటుంది. దీని వల్ల ప్రతీ ఏడాది ఈ సమయంలో చేపల వేటపై ప్రభుత్వం నిషేధం విధిస్తూ ఉంటుంది. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా అదే నిర్ణయం తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించి చేపల వేటకు వెళితే బోటు రిజిస్ట్రేషన్ ఏడాది రద్దు చేస్తారు. ఈ విరామ సమయంలో ప్రభుత్వం వారికి రూ.20 వేల ఆర్ధిక సాయం అందించనుంది. త్వరలో ఈ నిధులు లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనుంది. కాగా, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో భాగంగా ప్రమాద బీమా అందిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+