వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సినీ పరిశ్రమ ప్రముఖలతో ఏపీ ప్రభుత్వం కీలక సమావేశం- ఆన్ లైన్ టిక్కెట్ల పై అప్పుడే నిర్ణయం..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఏపీలో ప్రభుత్వం తీసుకున్న ఆన్ లైన్ టిక్కెట్ల వ్యవహారం పైన ప్రభుత్వం సుదీర్ఘ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా.. సినీ పరిశ్రమలోని నిర్మాతలు.. డిస్ట్రిబ్యూషన్..ధియేటర్ల యాజమన్యాలతో ఏపీ ప్రభుత్వం కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ నెల 20వ తేదీన జరిగే సమావేశానికి వారిని ఆహ్వానిస్తూ సమాచారం పంపింది. కేంద్ర ప్రభుత్వం గతంలో ఈ విధానం అమలు చేయాలంటూ రాష్ట్రాలకు లేఖలు రాసిందని.. లేక ప్రభుత్వ శాఖలు సైతం ఈ విధానం అమలు కోసం ప్రభుత్వానికి సూచనలు చేసాయని తాజాగా ఏపీ మంత్రి పేర్ని నాని చెప్పుకొచ్చారు.

అదే సమయంలో తెలుగు సినీ ప్రముఖులు సీఎం జగన్ ను కలిసిన సమయంలో ఈ ప్రతిపాదన చేసారని వివరించారు. దీంతో..దీని పైన అధ్యయనం తో పాటుగా అమలు కోసం సూచనలు ఇచ్చేందుకు కమిటీ ఏర్పాటు చేసామని మంత్రి చెప్పారు. దీని పైన సంబంధిత వర్గాల అభిప్రాయ సేకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం ఇప్పటికే సినీ పరిశ్రమలోని పలు విభాగాలకు చెందిన వారితో సంప్రదింపులు జరుపుతోంది. ఈ నెల 20వ తేదీన ప్రభుత్వం నిర్మాతలు - ఎగ్జిబిటర్లు..సిని థియేటర్ల యాజమన్యాలతో సమావేశం కానుంది.

AP Govt decided to discuss with cine industry on online ticket system implementation in the state

వారి నుంచి ఈ అంశంలో అభిప్రాయాలు సేకరించనుంది. ప్రభుత్వమే రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో టిక్కెట్లను ఆన్ లైన్ విధానంలో అమ్మ కాలు చేయటం ద్వారా..ఒకే ధర రాష్ట్ర వ్యాప్తంగా అమలు కానున్నాయి. వాటికి వచ్చే మొత్తంలో ప్రభుత్వం నిర్వహణా ఛార్జీలను మినహాయించి..మిగిలిన మొత్తాన్ని సంబంధిత వ్యక్తులు-సంస్థలకు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఇప్పటికే సినిమా టిక్కెట్లు విక్రయిస్తున్న యాప్ ..ఆన్ లైన్ వెబ్ సైట్లలో అవకతవకలు జరుగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి.

దీంతో..సినీ పరిశ్రమలో ఈ విభాగానికి చెందిన వారితోనే నేరుగా సంప్రదింపులు చేసి ఆన్ లైన్ టిక్కెట్ల విధానం పైన తుది నిర్ణయానికి రావాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో..ప్రభుత్వం ముందు తమ సూచనలు - సలహాలతో రావాలంటూ సంబంధిత వర్గాలకు ప్రభుత్వం నుంచి అధికారికంగా ఆహ్వానాలు వెళ్లాయి. ఈ నెల 20వ తేదీన ఈ కీలక సమావేశం జరగనుంది.

English summary
AP Govt decided to discuss with cine industry on online ticket system implementation in the state. on 20 ht govt organising this meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X