ఆ రెండు కేసులు సీఐడీకి - వైసీపీ నేతలకు ఉచ్చు..!!
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రెండు ప్రధాన కేసులను సీఐడీకి ఇవ్వాలని నిర్ణయించింది. వైసీపీ హయాంలో చంద్రబాబు నివాసంతో పాటుగా టీడీపీ కార్యాలయం పైన జరిగిన దాడుల కేసుల పైన ప్రస్తుతం విచారణ సాగుతోంది. ఈ రెండు కేసుల తీవ్రత..వాటి వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులను పట్టుకునేందుకు ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ రెండు కేసులను సీఐడీకి బదిలీ చేయాలనే ఈ నిర్ణయంతో ఇందులో ప్రమేయం ఉన్న వారికి ఉచ్చు బిగుసుకుంటోంది.
కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు ఇంటి పైన దాడి.. టీడీపీ కేంద్ర కార్యాలయం పై దాడి కేసులను సీఐడీకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ రెండు కేసులు ప్రస్తుతం మంగళగిరి పోలీసుల పరిధిలో ఉంది. ఇప్పటికే ఈ కేసుల్లో ప్రమేయం ఉన్న నేతలను పోలీసులు విచారించారు. టీడీపీ కార్యాలయం పై దాడి కేసులో మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను అరెస్ట్ చేసారు. మిగిలిన వారు సుప్రీంకోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. వారి విచారణకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.

అదే విధంగా చంద్రబాబు ఇంటి పైన దాడి కేసులో ఇప్పటికే మాజీ మంత్రి జోగి రమేశ్ ను పోలీసులు విచారించారు. ఈ రెండు కేసుల్లో వైసీపీకి చెందిన క్రిష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు నేతలు ఉన్నారు. పార్టీ ముఖ్య నేత సజ్జల ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. ఇక, ఇప్పుడు ఈ రెండు కేసులు సీఐడీకి అప్పగించటంతో ఇందులో ప్రమేయం ఉందని భావిస్తున్న వైసీపీ నేతల మెడకు ఉచ్చు ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications