స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల సేవల పై ప్రభుత్వం అనూహ్య నిర్ణయం, తాజా ఆదేశాలు..!!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత గ్రామ, వార్డు సచి వాలయాల పేర్లు మార్పు చేసింది. ఉద్యోగుల బాధ్యతల విషయంలోనూ ప్రక్షాళన చేసింది. వారికి కొత్త బాధ్యతలు అప్పగించింది. పౌర సేవల విషయంలో వారి పాత్ర కీలకంగా మారుతోంది. ఇదే సమయంలో ప్రభుత్వం ఈ స్వర్ణ గ్రామ, వార్డుల విషయంలో మరో ఆసక్తి కర నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

స్వర్ణ గ్రామ, వార్డుల పనితీరు పై ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఇందుకోసం క్యూఆర్ కోడ్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆ శాఖ డైరెక్టర్ ఎం. శివప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. స్వర్ణ గ్రామం, వార్డు కార్యాలయాల సేవల నాణ్యతను మెరుగుపర్చేందుకు ఆర్గనైజేషన్ ఫెర్ఫార్మెన్స్ ట్రాకింగ్ సిస్టమ్ (ఒపిటిఎస్) అమల్లోకి తీసుకువస్తున్నట్లు ఈ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ విధానంపై అమలుపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేకంగా దృష్టి సారించాలని కోరారు. ఈ కొత్త విధానంలో భాగంగా, ప్రతి స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో క్యూఆర్ కోడ్ ఆధారిత పబ్లిక్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఏర్పాటు చేయనున్నారు. ప్రజలు కార్యాలయానికి వచ్చినప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, అందుతున్న సేవలపై తమ అభిప్రాయాన్ని సులభంగా తెలియజేసేందుకు అవకాశం ఈ విధానంతో లభిస్తుంది.

ap-govt-decided-to-hold-survey-to-take-feed-back-on-swana-ward-office-functioning-here-the-details

సచివాలయ వ్యవస్థలో సేవల పై ప్రజాభిప్రాయం

ఇందుకు https://epts.ap.gov.in/opts/login htmlలో స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఒపిటిఎస్ పోర్టల్ లో తప్పనిసరిగా లాగిన్ అయ్యి, క్యూఆర్ కోడ్ పోస్టర్ ను పిడిఎఫ్ ఫార్మేట్లో డౌన్లోడ్ చేసి కలర్ ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ కలర్ ప్రింట్ను కార్యాలయంలో ప్రజలకు స్వర్ణ గ్రామం కనిపించే ప్రదేశాల్లో ప్రవేశ మార్గంలో, వేచి ఉండే ప్రదేశంలో, సర్వీసు కౌంటర్ వద్ద, నోటీసు బోర్డు వంటి ప్రదేశాల్లో పోస్టర్లు ప్రదర్శించాలి. పెద్ద కార్యాలయాల్లో ఒకటి కంటే ఎక్కువ పోస్టర్లు ఏర్పాటు చేయాలని, ప్రజలను ఫీడ్ బ్యాక్ ఇవ్వడానికి ప్రోత్సహించాలని ఆదేశించారు. లాగిన్ వివరాలు గోప్యంగా ఉంచాలని సూచించారు. ఫీడ్ బ్యాక్ ఇవ్వాలనుకున్న పౌరులు కార్యాలయంలోని క్యూఆర్ కోడ్ను తమ స్మార్ట్ ఫోన్తో స్కాన్ చేస్తే వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. దీనిలో కార్యాలయ సిబ్బంది పనితీరు ఎలా ఉంది?, మీరు కార్యాలయానికి వచ్చిన పని సంతృప్తి కరంగా జరిగిందా?, కార్యాలయ సిబ్బంది అందుబాటులో ఉన్నారా? అనే 3 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. కింద ఇచ్చిన సమాధానాలను పౌరులు ఎంపిక చేసుకున్న అనంతరం పేరు, మొబైల్ నెంబరు వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. రాష్ట్రస్థాయిలో ఫీడ్ బ్యాక్ సమీక్షించి తీసుకోవాల్సిన చర్యలను 3 ఉన్నతాధికారులు చేపడతారు. దీని ద్వారా సేవలలో పారదర్శకత పెరిగి, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందే అవకాశం ఉందని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+