వార్డు సచివాలయ ఉద్యోగులకు డ్రెస్ కోడ్ - 4జీ సిమ్ పంపిణీ : పలు మార్పుల దిశగా..!!
ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తూ..నిర్వహిస్తున్న గ్రామ..వార్డు సచివాలయాల్లో కీలక మార్పుల దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ప్రొబేషన్ డిక్లేర్ చేసే విధంగా నిర్ణయిం తీసుకుంది. అందులో తొలిగా ఉత్తరాంధ్రలో ప్రక్రియ ప్రారంభించింది. ఇక, ఇప్పుడు వారి విధుల నిర్వహణలో కొన్ని కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా.. కొత్తగా సచివాలయల్లో పని చేసే కార్యదర్శులకు డ్రెస్ కోడ్ అమలు చేయాలని డిసైడ్ అయింది. కొద్ది రోజులుగా ఈ అంశం పైన చర్చలు సాగుతున్నా..ఇప్పుడు అమలు దిశగా ఆదేశాలు జారీ చేసింది.

యూనిఫాం తోనే ఇక సేవల్లో
వచ్చే నెల నుంచి ఈ విధానం అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద అమలు చేసి..ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. దీనికి అనుగుణంగా కొద్ది పాటు మార్పులతో అమలుకు నిర్ణయించారు. అందులో భాగంగా.. రాష్ట్రవ్యాప్తంగా 11,162 గ్రామ సచివాలయాలు, 3,842 వార్డు సచివాలయాల్లో 14 శాఖలకు చెందిన 1.34 లక్షల మంది ఉద్యోగులకు యూనిఫాం అందించాలని అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లను ఆదేశించింది. ఇప్పటికే యూనిఫాం క్లాత్ వివిధ సంస్థల ద్వారా కొనుగోలు చేసినందున వాటిని నియోజకవర్గాల కేంద్రాల్లో పంపిణీ చేయాలని సూచించింది.

4 జీ సేవల కోసం సిమ్ కార్డులు సైతం
పురుషులకు స్కైబ్లూ చొక్కా, బిస్కెట్ రంగు ప్యాంటు.. మహిళలకు స్కైబ్లూ టాప్, బిస్కెట్ రంగు లెగిన్ యూనిఫాం అందజేయనున్నారు. వారి శాఖలు తెలిసేలా ట్యాగ్ కలర్స్ ఇవ్వనున్నారు. మహిళా పోలీసులు, ఏఎన్‌ఎంలు, ఎనర్జీ అసిస్టెంట్లకు తప్ప మిగిలినవారందరికీ మూడు జతల యూనిఫారం అందించనున్నారు. 167 అసెంబ్లీ నియోజకవర్గాల కేంద్రాల్లో ఈ యూనిఫారం క్లాత్ పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇదే సమయంలో సిబ్బందికి 4జీ సిమ్ పంపిణీకి నిర్ణయం తీసుకుంది.

వెంటనే గుర్తించేలా.. అందుబాటులో ఉండేలా
సచివాలయాల్లో పనిచేసే 10,467 మంది సంక్షేమ-విద్య అసిస్టెంట్లు, 4,260 మంది వార్డు సంక్షేమ అభివృద్ధి సెక్రటరీలకు 4 జీ సిమ్ కార్డులు పంపిణీ చేయాలని గ్రామ/వార్డు సచివాలయాల శాఖ జాయింట్ కలెక్టర్లకు సూచించింది. వీరందరికీ కలిపి 14,727 సిమ్‌లు పంపిణీ చేయనున్నారు. ఆయా సచివాలయాల్లో అందుబాటులో ఉన్న నెట్‌వర్క్‌లను అనుసరించి ఐడియా, బీఎ్‌సఎన్‌ఎల్, ఎయిర్‌టెల్, జియో సిమ్‌లను అందించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని నెట్‌వర్క్ సంస్థలకు అధికారులు సూచించారు.
-
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
రేషన్ లబ్దిదారుల కోసం ప్రభుత్వం ఊహించని నిర్ణయం, ఇక నేరుగా..!! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా నేటినుండి కిరోసిన్ పంపిణీ మొదలెట్టిన ఏపీ ప్రభుత్వం! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'? -
ఆ లాజిక్ ఏంటో ? చంద్రబాబును ఇరుకునపెట్టేసిన సాయిరెడ్డి..! -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు











Click it and Unblock the Notifications