సీపీఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం భారీ బొనాంజ..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిల చెల్లింపుల పైన వరుస నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వం తాజాగా సీపీఎస్ ఉద్యోగుల విషయంలో గుడ్ న్యూస్ చెప్పింది. ఒకేసారి సీపీఎస్ ఉద్యోగుల ఫ్రాన్ ఖాతాల్లోకి ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాండ్ బకాయిలు రూ.2,300 కోట్లు చెల్లింపులకు ఆమోదం తెలిపింది. సీపీఎస్ ఉద్యోగులకు కూటమి నేతలు పాత పెన్షన్ విధానం పైన ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉద్యోగుల్లో హర్షం వ్యక్తం అవుతోంది.
ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల విడుదల చేసింది. ఉద్యోగులకు చెల్లించా ల్సిన బకాయిలు సుమారు రూ. 6,200 కోట్లు తాజాగా విడుదల చేసారు. సీపీఎస్, జీపీఎఫ్, ఏపీజీఏఐ కింద ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ రూ.6,200 కోట్లు విడుదల చేసింది. కాగా జనవరిలోనూ రూ.1,033 కోట్ల బకాయిలను ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం చెల్లించింది. ఇప్పుడు తాజాగా సీపీఎస్ ఉద్యోగుల విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి సీపీఎస్ ఉద్యోగుల ఫ్రాన్ ఖాతాల్లోకి ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాండ్ బకాయిలు రూ.2,300 కోట్లు చెల్లించేసింది. గత ప్రభుత్వం బకాయిపెట్టిన 5 నెలల సొమ్ముతోపాటు, కూటమి సర్కార్ వచ్చిన తర్వాత 9 నెలల మ్యాచింగ్ గ్రాంట్‌ను ఒకేసారి చెల్లించింది.

సీపీఎస్ ఉద్యోగులకు ఫిబ్రవరి వరకు మ్యాచింగ్ గ్రాంట్ ఫ్రాన్ ఖాతాల్లో జమయిందని మెయిల్స్ రావడంతో సీపీఎస్ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఎప్పుడూ 12 నెలల మ్యాచింగ్ గ్రాంట్ బకాయిలు పెండింగ్‌లో ఉండేవని చెప్పుకొచ్చారు. ఇప్పుడు నాలుగు లక్షల సీపీఎస్ ఉద్యోగులకు సంబంధించి మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయటం మేలు చేస్తుందని చెబుతున్నారు. త్వరలోనే డీఏ బకాయిలు చెల్లిస్తారని ఉద్యోగ సంఘాల నేతలు ఆశాభావం వ్యక్తం చేసారు. కాగా, సీపీఎస్ విధానంలో పాత పెన్షన్ పునరుద్ధరించాలని కోరుతున్నారు. ఎన్నికల సమయంలో ఈ అంశం పైన పరిశీలన చేసి నిర్ణయం తీసుకుంటామని కూటమి నేతలు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. దీంతో, ప్రభుత్వ నిర్ణయం పైన సీపీఎస్ ఉద్యోగులు ఆశతో ఉన్నారు.












Click it and Unblock the Notifications