ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన..!!
ఏపీలో ఎన్నికల ముహూర్తం ఖరారైంది. షెడ్యూల్ ప్రకటనతో కోడ్ అమల్లోకి వచ్చింది. ప్రధాన పార్టీలు ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. ఈ సమయంలోనే ప్రభుత్వం షెడ్యూల్ కు ముందుగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగులకు డీఏ, అమరావతిలో సచివాలయ ఉద్యోగులకు ఇంటి స్థలాల పైన జీవోలు జారీ చేసింది. ఇదే క్రమంలో తాజాగా 2023-24 రబీ సీజన్ కింద 87 కరువు మండలాలను ప్రకటించింది.
ఎన్నికల సమయంలో ఏపీ ప్రభుత్వం ఏపీలో కరువు మండలాలను ప్రకటించింది. 2023 ఖరీఫ్‌లో 448 మండలాల్లో తీవ్ర వర్షాభావం ఏర్పడగా, 103 కరువు మండలాలు ప్రకటించిన జగన్ సర్కారు.. తాజాగా 2023-24 రబీ సీజన్ కింద 87 కరువు మండలాలను ప్రకటించింది. ఈశాన్య రుతుపవనాలు బలహీనంగా ఉండటం వల్ల తీవ్ర వర్షాభావం నెలకొన్న ఆరు జిల్లాల్లోని 87 మండలాలతో కరువు ప్రభావిత మండలాల జాబితాను కోడ్ అమలులోకి వచ్చేముందు విడుదల చేసింది. నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, ప్రకాశం జిల్లాల్లో 63 తీవ్రమైన కరువు మండలాలుగా, 24 ఒక మోస్తరు కరువు మండలాలుగా గుర్తించింది.

నోటిఫై చేసే కరువు మండలాల్లో మున్సిపల్ పట్టణ ప్రాంతాలు, నీటి వనరులకు గ్యారెంటీ ఉన్న ప్రాంతాలను తొలగించి, నిర్దిష్ట ప్రాంతాలను గుర్తిస్తూ కలెక్టర్లు జిల్లా గెజిట్‌లు ప్రకటిస్తారని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించని పట్టణ మండలాలను తాగునీటి అవసరాల కోసం కరువు మండలాలతో సమానంగా పరిగణించి, తక్షణ చర్యలు తీసుకుంటారని పేర్కొంది. ఈ మేరకు విపత్తుల నిర్వహణశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.ఈశాన్య రుతుపవనాల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 400.6 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కనీసం 302.6మి.మీ. వాన పడాల్సి ఉంది. కానీ గత అక్టోబరు నుంచి ఈ నెల మొదటివారం వరకు కేవలం 232.7 మి.మీ. మాత్రమే కరిసినట్లుగా నమోదైంది.
-
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
ఆ రైతులకు ఏపీ ప్రభుత్వం చల్లని కబురు.. మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు -
ఆ లాజిక్ ఏంటో ? చంద్రబాబును ఇరుకునపెట్టేసిన సాయిరెడ్డి..! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications