నగరి సహా అసెంబ్లీ స్థానాల సర్దుబాటు, కీలక మార్పులు- మిషన్ 2029..!!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కొత్త జిల్లాలతో పాటుగా రెవిన్యూ డివిజన్లు.. అదే విధంగా మండలాల ఏర్పాటు పైన మంత్రివర్గ ఉప సంఘం కీలక ప్రతిపాదనలపై చర్చిస్తోంది. ఇక... అసెంబ్లీ స్థానాల పరిధి అవసరమైన చోట సర్దుబాటు దిశగా కసరత్తు చేస్తున్నారు. దీని పైన రెవిన్యూ అధికారులకు కీలక సూచనలు చేసారు. పెద్ద అసెంబ్లీ నియోజకవర్గాలకు రెవిన్యూ డివిజన్ హోదా ఇవ్వాలని భావిస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన.. పెంపును పరిగణలోకి తీసుకొని ప్రస్తుత కసరత్తు కొనసాగుతోంది.

జిల్లాల పునర్‌వ్యవస్థీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం కీలక ప్రతిపాదనల పైన కసరత్తు చేస్తోంది. ప్రాంతాల మధ్య సమతౌల్యం, ఆర్థిక, సామాజిక అంశాలను ప్రామాణికంగా తీసుకుని కసరత్తు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ప్రస్తుతం ఈ దిశగా మరింతగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని, అందులో ప్రజాప్రతినిధులు, ప్రాంతాల ఆకాంక్షలు ప్రతిబింబించాలని రెవెన్యూ శాఖను ఆదేశించింది. ప్రత్యేకించి ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఒకే రెవెన్యూ డివిజన్‌లో ఉండేలా కసరత్తు చేయాలని దిశానిర్దేశం చేసింది. దాని నివేదిక ఆధారంగా కొత్త డివిజన్ల ఏర్పాటుపై ప్రతిపాదనలు చేయనుంది. ఎన్ని కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలో ఇప్పటికే స్పష్టత వచ్చింది. దీంతో, ఉపసంఘం తాజా భేటీలో ప్రధానంగా రెవెన్యూ డివిజన్లు, అసెంబ్లీ నియోజకవర్గాలపై చర్చించింది. ఈ భేటీలో అధికారులు కీలక అంశాలను నివేదించారు.

ap-govt-directions-for-revenue-officials-over-new-districts-and-assembly-segments

ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం ప్రస్తుతం రెంటికి పైగా రెవెన్యూ డివిజన్లలో విస్తరించి ఉందని వివరించారు. ఈ నేపథ్యంలో ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒక రెవెన్యూ డివిజన్‌లోనే సర్దుబాటు చేసేలా కొత్త డివిజన్లను ప్రతిపాదించాలని మంత్రులు రెవెన్యూ శాఖకు సూచించారు. ఉదయగిరి తరహాలో రాష్ట్రంలో ఎన్ని నియోజకవర్గాలు ఎన్ని డివిజన్లలో ఉన్నాయి.. వాటిని ఒకే రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఎలా సర్దుబాటు చేయాలనే అంశం పై చర్చ జరిగింది. దీనిపై తక్షణమే కలెక్టర్ల నుంచి నివేదికలు తెప్పించుకోవాలన్నారు. నగరి స్థానం పరిధిలోని రెండు మండలాలు తిరుపతిలో, మూడు మండలాలు చిత్తూరులో ఉన్నాయి. మొత్తం నగరిని తిరుపతి జిల్లా, రెవె న్యూ డివిజన్‌ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు సమాచారం. అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలుగా ఉంటూ పెద్ద మండలాలుగా ఉన్నవి.. రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుకు అవకాశం ఉన్న పెద్ద నియోజకవర్గాల వివరాలు కూడా కోరారు.

అదే సమయంలో ఉదయగిరి, మడకశిర రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు. వాటిని ప్రత్యేక డివిజన్లుగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు చర్చకొచ్చాయి. అలాగే కందుకూరు, అద్దంకి, పుంగనూరు నియోజకవర్గాలనూ డివిజన్లుగా ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించనున్నారు. అలాగే కొన్ని అసెంబ్లీ నియోజక వర్గాలు, రెవెన్యూ మండలాలు, డివిజన్లను ఇతర జిల్లాలకు మార్చే అంశాన్నీ సబ్‌కమిటీ పరిశీలిస్తోంది. 2024 ఎన్నికల సమయంలో జిల్లాలు, మండలాల పైన ఇచ్చిన హామీలను అమలు చేస్తూ...రాజకీయంగా పట్టు పెంచుకునేలా 2029 నాటికి కూటమి నేతలు సమాయత్తం అవుతున్నారు. అసెంబ్లీ స్థానాల పరిధి సర్దుబాటులో తీసుకుంటున్న నిర్ణయాలు రాజకీయంగా ఆసక్తిని పెంచుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+