పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు- జమ ముహూర్తం, చెక్ చేసుకోండి..!!

ఏపీ ప్రభుత్వం రెండో విడత అన్నదాత సుఖీభవ నిధుల విడుదల పైన కసరత్తు చేస్తోంది. గతం లో తీసుకున్న నిర్ణయం మేరకు పీఎం కిసాన్ తో పాటుగా ఈ పథకం నిధులను విడుదల చేసేలా అధికారులు సమాయత్తం అవుతున్నారు. దీపావళి వేళ పీఎం కిసాన్ 21వ విడత నిధులను విడుదల చేసేందుకు కేంద్రం నిర్ణయించింది. పీఎం కిసాన్ తో పాటుగానే అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు జమ కానున్నాయి. ఈ మేరకు ముహూర్తం ఖరారు చేసింది. రైతులకు కీలక సూచనలు చేస్తున్నారు.

ఏపీ ప్రభుత్వం రైతులకు పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల విడుదల దిశగా కార్యాచరణ సిద్దం అవుతోంది. అక్టోబర్ 18న ఈ రెండు పథకాల నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయాలని సూత్ర ప్రాయంగా నిర్ణయించారు. దీపావళి వేళ రైతులకు నిధులు అందించాలని కేంద్రం భావిస్తోంది. దీంతో, పీఎం కిసాన్ తో పాటుగా మూడు విడతలుగా అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించటంతో అదే రోజున ఈ పథకానికి సంబంధించిన నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి 20వ విడత నిధులను ఆగస్టు 2న విడుదల చేసారు. 21వ విడత నిధులను దీపావళికి విడుదల చేసేందుకు కేంద్రప్రభుత్వం నిర్ణయించింది.

ap-govt-fixed-schedule-for-release-of-annadata-sukhibava-second-phase-funds

రైతులకు పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల విడుదల దిశగా కార్యాచరణ సిద్దం అవుతోంది. అక్టోబర్ 18న ఈ రెండు పథకాల నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయాలని సూత్ర ప్రాయంగా నిర్ణయించారు. దీపావళి వేళ రైతులకు నిధులు అందించాలని కేంద్రం భావిస్తోంది. దీంతో, పీఎం కిసాన్ తో పాటుగా మూడు విడతలుగా అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించటంతో అదే రోజున ఈ పథకానికి సంబంధించిని నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి 20వ విడత నిధులను ఆగస్టు 2న విడుదల చేసారు. 21వ విడత నిధులను దీపావళికి విడుదల చేసేందుకు కేంద్రప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

కాగా, షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏప్రిల్‌-జూలై మధ్య 41.58 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేయాల్సిన నిధుల్ని ఆగస్టు 2న జమ చేసారు. పీఎం కిసాన్‌ కింద ఏటా రూ.6వేలు ఇస్తుండగా, అన్నదాత-సుఖీభవ కింద రూ.14వేలు ఇస్తామని రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. వీటిని కేంద్రంతోపాటు మూడు విడతలుగా ఇస్తామని అధికార వర్గాలు తెలిపాయి. దీని ప్రకారం.. అక్టోబర్ 18న కేంద్రం రూ.2వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.5వేలు జమ చేస్తాయని సమాచారం.

అయితే కౌలు రైతులకు కేంద్రం పీఎం కిసాన్‌ నిధులు ఇవ్వడం లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే అన్నదాత-సుఖీభవ కింద రెండు విడతల్లో రూ.20 వేలు చెల్లించాలని నిర్ణయించింది. దీనిలో మొదటి విడతగా వచ్చే అక్టోబరులో రూ.10వేలు చెల్లిస్తామని వ్యవసాయ శాఖ తెలిపింది. లబ్ది దారుల జాబితాలను అన్నదాత-సుఖీభవ పోర్టల్‌ ద్వారా గ్రామస్థాయిలో ధ్రువీకరణ చేశారు. భూమి లేని కౌలు రైతులు ఈ పథకం కింద లబ్ధి పొందటానికి కౌలు గుర్తింపు కార్డు పొంది, ఈ-క్రాపులో నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+