అమరావతిలో 47 అంతస్థుల భవనాలు - ప్లాన్, షెడ్యూల్ ఫిక్స్..!!
కూటమి ప్రభుత్వం అమరావతి పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. అధికారంలోకి వచ్చిన రోజు నుంచే అమరావతి విషయంలో వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఆర్దికంగా రుణాల ద్వారా నిధుల సమీకరణ చేస్తోంది. ఇక, ఆగిపోయిన పనులను తిరిగి పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇచ్చేలా కార్యాచరణ సిద్దం చేస్తోంది. అమరావతి లోని ఐకానిక్ భవనాలు 47, 39 అంతస్థుల్లో పూర్తి చేసేలా షెడ్యూల్ ఫిక్స్ చేసింది. పనుల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది.
ప్రభుత్వ తాజా నిర్ణయం
అమరావతిలో ఐకానిక్ భవనాల పనులను తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముహూర్తం ఖరారు చేసింది. జనవరిలోనే పనులు ప్రారంభించేలా కసరత్తు కొనసాగు తోంది. అమరావతి ఓఆర్ఆర్ అలైన్‌మెంట్ ఎక్కువ మలుపులు లేకుండా ముందుకు తీసుకెళ్లేలా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటికే సీఆర్డీఏ భవనం పనులను పునఃప్రారంభించి న ప్రభుత్వం ఇప్పుడు ఐకానిక్ భవనాల నిర్మాణంపై దృష్టి పెట్టింది.

భారీ భవనాలు
గవర్నమెంట్ కాంప్లెక్స్‌లో అయిదేళ్ల కాలంలో ఎలాంటి పనులు చేపట్టక పోవటంతో చుట్టూ నీరు చేరి ఆ ప్రదేశమంతా తటాకంగా మారింది. దీంతో, వాటి పటిష్టత పైన సందేహాలు వ్యక్తమయ్యాయి. వీటి పైన మద్రాస్, హైదరాబాద్ ఐఐటీ నిపుణుల బృందంతో అధ్యయనం చేయించారు. నిపుణు ల బృందం ఫౌండేషన్‌కి ఎటువంటి ఇబ్బంది లేదని తేల్చింది. ఫౌండేషన్ వద్ద నీటిని తోడేస్తు న్నారు. జీఏడీ టవర్స్ 47 అంతస్థులు, టెర్రస్, హెలీప్యాడ్‌తో సహా నిర్మాణం చేపట్టేలా ప్రణాళిక లు సిద్దం అయ్యాయి.
జనవరిలో మొదలు
అదే విధంగా 39 అంతస్థుల్లో హెచ్ఓడీ టవర్స్ నిర్మాణం చేయనున్నారు. అసెంబ్లీ భవనం 103 ఎకరాల్లో 250 మీటర్ల ఎత్తులో నిర్మించేందుకు సిద్దమయ్యారు. ఏడు అంతస్థులతో 55 మీటర్ల ఎత్తుతో హైకోర్టు నిర్మాణం చేపట్టనున్నారు. వీటన్నింటికీ ర్యాప్ట్ ఫౌండేషన్ పూర్తి చేసి జనవరి నెలా ఖరులోగా నిర్మాణ పనులు ప్రారంభించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసింది. ఇక, సీఆర్డీఏ అధికారులు సైతం ఈ పనుల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయిస్తున్నారు. అటు ప్రభుత్వం నిరంతరం అమరావతి పనుల గురించి ఆరా తీస్తోంది. దీంతో, జనవరి నుంచి అమరావతి కొత్త రూపు సంతరించుకోనుంది.












Click it and Unblock the Notifications