'కాపులకు ఏడాదికి వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పి ముష్టి వేసినట్టు 100 కోట్లా?'
అమరావతి: కాపులకు ఏడాదికి రూ. 1000 కోట్లు ఇస్తామని చెప్పిన టీడీపీ ప్రభుత్వం ముష్టి వేసినట్టు రూ. 100 కోట్లు ఇవ్వడం ఎంత వరకు సమంజసమని వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు.
సోమవారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో ఏపీ రాష్ట్ర సమస్యలపై చర్చించలేదని మండిపడ్డారు. నిత్యావసర వస్తువుల ధరలు, డెల్టాలో ఎండిపోతున్న పంటలు, ప్రత్యేక హోదా, ధాన్యం సేకరణపై కేబినెట్ సమావశంలో చర్చించకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.

ప్రభుత్వ భూములను పారిశ్రామికవేత్తలకు 99 ఏళ్ల పాటు లీజుకు ఇస్తున్నారని మండిపడ్డారు. పేద రైతులకు కూడా 99 ఏళ్లకు లీజుకు ఇస్తారా? అంటూ ప్రశ్నించారు. సామాన్యులను పట్టించుకోని టీడీపీ ప్రభుత్వం... పారిశ్రామికవేత్తలకు మాత్రం రెడ్ కార్పెట్ పరుస్తోందని విమర్శించారు. ఏపీ కేబినెట్ సమావేశంలో కూడా రాష్ట్ర సమస్యలపై చర్చించలేదని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications