పెన్షన్ లబ్ది దారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఆప్షన్ మీదే..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీ మేరకు పెన్షన రూ 4 వేలకు పెంచింది. ఇంటి వద్దకే పెన్షన్ అందిస్తోంది. ఇదే సమయంలో ఏడాది కాలంగా అర్హత ఉండీ పెన్షన్ అందని వారు ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ పెన్షన్ అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇదే సమయంలో సామాజిక పెన్షన్ లబ్దిదారులకు ఊరట కలిగేలా ప్రభుత్వం నిర్ణయం ప్రకటించింది.
బదిలీకి అనుమతి
సామాజిక పింఛన్ల బదిలీకి రాష్ట్రప్రభుత్వం గ్రీన్ సిగల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఆప్షన్‌ను గ్రామ, వార్డు సచివాలయాల్లో అందు బాటులో ఉంచింది. ఉపాధి కోసం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లిన వారు తమ పింఛను తీసుకోవాలంటే ఇప్పటి వరకు వారి స్వగ్రామానికి రావాల్సి ఉండేది. ప్రభుత్వం ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం ప్రకారం తాత్కాలికంగా నివాసం ఉన్న ప్రాంతంలోని గ్రామ, వార్డు సచివాలయంలో తమ వివరాలు అందించి పింఛను బదిలీ చేసుకొనేలా వెసులుబాటు కల్పిస్తున్నారు.

లబ్దిదారులకు ఊరట
గతంలో ఈ విధానం అమల్లో ఉండేది. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత నిలిపివేశారు. ప్రస్తుతం మళ్లీ ఈ విధానం అమల్లోకి రావడంతో వేలాది మంది పింఛనుదారులకు ఊరట లభించనుది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని రకాల సామాజిక ఫించన్లను పెంచి అమలు చేస్తున్నారు. దాదాపు 64 లక్షల మందికి పెన్షన్ అందుతోంది. తాజాగా వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగుల ద్వారా లబ్దిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ అందించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి అందేలా చర్యలు తీసుకున్నారు.
కొత్త పెన్షన్ల కోసం
ప్రభుత్వం తాజాగా పెన్షన్ బదిలీకి అవకాశం కల్పించటంతో..పెన్షన్ కోసం స్వగ్రామాలకు రావాల్సిన అవసరం లేకుండా ఎక్కడి నుంచైనా పొందే వెసులుబాటు కలగనుింది. ఇక, రాష్ట్రంలో ఏడాది కాలంగా కొత్త పింఛన్ల మంజూరు ఏడాదిగా నిల్చిపోయింది. దీంతో, సుమారు మూడు లక్షల మంది పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. గత వైసిపి ప్రభుత్వం నవశకం పథకంలో భాగంగా ఏటా జనవరి, జులై నెలల్లో కొత్త వారికి పింఛన్లు మంజూరు చేస్తూ వచ్చింది. గతేడాది జులై, ఏడాది జనవరిలో పింఛన్లు మంజూరు చేయకుండా దరఖాస్తులన్నింటినీ పెండింగ్‌లో ఉంచింది. వీరి విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.












Click it and Unblock the Notifications