ఎన్నికల వేళ సీఎం జగన్ వ్యూహం - 1.46 కోట్ల కుటుంబాలతో మమేకం..!!

ఎన్నికల వేళ సీఎం జగన్ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా పాలన ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సంక్షేమ పథకాల అమలు మరోసారి తమకు అధికారం అందిస్తాయని వైసీపీ విశ్వసిస్తోంది. ప్రతీ ఇంటికి మంచి జరిగిందని భావిస్తేనే తనకు అండగా నిలవాలని సీఎం జగన్ కోరుతున్నారు. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా తాజాగా 1.46 కోట్ల కుటుంబాలకు సీఎం జగన్ పాలనలో ప్రయోజనం అందింది.

అనూహ్య మద్దతు : రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమానికి అనూహ్య మద్దతు లభించింది. నెల రోజుల సమయంలో దాదాపు కోటిన్నార కుటుంబాలతో ప్రభుత్వ యంత్రాంగం మమేకం అయింది. 94 లక్షల అవసరమైన సర్టిఫికెట్లు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15,004 గ్రామా సచివాలయాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు.

jagan12

విద్య సంవత్సరం ప్రారంభం ప్రారంభం అయిన నేపథ్యంలో విద్యార్థులకు అవసరం అయ్యే కులం, ఆదాయం, నివాసం వంటి ఇతర ధ్రువీకరణ పత్రాలకు అక్కడే దరఖాస్తులు స్వీకరించడం, ఇంటింటికి వెళ్లి వెనువెంటనే అక్కడికక్కడే వాటిని మంజూరు చేయడం వంటి ప్రక్రియ ద్వారా ప్రజలకు డబ్బు, సమయాన్ని అదా చేసే చర్యలు ప్రభుత్వం చేపట్టింది.

46 కోట్ల కుటుంబాలతో : గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు కలిసి ఈ క్రమంలో 93, 57, 707 సర్టిఫికెట్స్ మంజూరు చేసారు. దాదాపు 5. 3 కోట్ల మందికి చేరువ అయ్యేలా చేపట్టిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో 1, 46, 27, 905 కుటుంబాలను కలిసి దాదాపు 11 రకాల సర్టిఫికెట్స్ , ఇంకా రేషన్ కార్డు లో మార్పులు, చేర్పులు వంటివి చేపట్టి అక్కడికక్కడే మంజూరు చేశారు. గతంలో విద్యార్థులకు ఈ సర్టిఫికెట్స్ తీసుకోవడం ఒక పెద్ద ప్రయాస అయ్యేది.

మండల కార్యాలయాలకు వెళ్లి లేదా ఈసేవలో దరఖాస్తు చేసుకుని అవి మళ్ళీ వచ్చేవరకూ ఎదురుచూపులు ఉండేవి. జగనన్న సురక్ష కార్యక్రమంలో లక్షలాది మంది విద్యార్థులకు వెనువెంటనే సర్టిఫికెట్స్ ఇచ్చి వారికి పనులు సులభతరం చేసారు.

jagan17

ప్రతీ ఒక్కరికీ చేరువయ్యేలా : జగనన్న సురక్ష ద్వారా అత్యధికంగా 40.52 లక్షల మంది కుల ధ్రువీకరణ పత్రాలను పొందగా 38.52 లక్షల మందికి ఆదాయ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. 2,70,073 మంది తమ వ్యవసాయ భూములకు సంబంధించి 1 బీ ధ్రువీకరణ పత్రాలను పొందగా మరో 139,971 మంది కంప్యూటరైజ్డ్‌ అడంగల్‌ సర్టిఫికెట్లు పొందారు.

ఈ నెల 18వ తేదీన జరిగిన క్యాంపులో ఒక్క రోజులో అత్యధికంగా 7,37,638 వినతులను అక్కడికక్కడే పరిష్కరించారు. మరో విడత జగనన్న సురక్ష నిర్వహణకు ప్రభుత్వం సిద్దం అవుతోంది. దీని ద్వారా ఎన్నికల సమయంలో ప్రతీ కుటుంబానికి చేరువ అవుతూ..ప్రతీ ఒక్కరికీ మద్దతుగా నిలుస్తూ.. వారి మద్దతు పొందటమే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+