Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అన్నీ ప్రత్యేకం- అతిధులకు ప్రత్యేక రుచులు సిద్దం..!!

దేశ విదేశాల నుంచి వస్తున్న ప్రతినిధులకు ప్రభుత్వం ఆతిధ్యం ఇస్తోంది. అతిధిలకు ఏపీలో ప్రత్యేక రుచులను అందించేందుకు ఏర్పాట్లు చేసారు.

విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ అట్టహాసంగా ప్రారంభమైంది. దేశ విదేశాల నుంచి వస్తున్న ప్రతినిధులకు ప్రభుత్వం ఆతిధ్యం ఇస్తోంది. 26 దేశాల ప్రతినిధులతో పాటుగా కేంద్ర మంత్రులు.. పారిశ్రామిక దిగ్గజాలు విశాఖ చేరుకున్నారు. వారికి అనుకూలగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అతిధులకు ఈ సాయంత్రం ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం తరపున విందు ఏర్పాటు చేసారు. ఇప్పటికే సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన పారిశ్రామిక వేత్తలు ముఖేష్ అంబానీ..జీఎంఆర్ ఇతర ప్రముఖలు సీఎంతో సమావేశమయ్యారు. ఇక అతిధిలకు ఏపీలో ప్రత్యేక రుచులను అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

అతిధులకు ప్రభుత్వం విందు

అతిధులకు ప్రభుత్వం విందు

విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ (జీఐఎస్‌)కు దేశ, విదేశాల నుంచి వచ్చే అతిథుల కోసం నోరూరించే వంటకాలను సిద్ధం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రాంతాల వెజ్, నాన్‌వెజ్‌ రుచులను వీరికి అందించనున్నారు. ఈ రోజు ప్రత్యేకంగా మధ్నాహ్నం మెనూ సిద్దమైంది. మధ్యాహ్నం భోజనంలో బొమ్మిడాయిల పులుసు, గుంటూరు కోడి వేపుడు, రొయ్యల మసాలా, మటన్‌ కర్రీ, చికెన్‌ పలావ్, వెజ్‌ రకాల్లో మష్రూం, క్యాప్సికం కూర, ఆలూ గార్లిక్‌ ఫ్రై, కేబేజీ మటర్‌ ఫ్రై, వెజ్‌ పలావ్, రోటీ, కుల్చా, పన్నీర్‌ బటర్‌ మసాలా, మెంతికూర-కార్న్‌ రైస్, మిర్చి కా సలాన్, టమాటా పప్పు, బీట్‌రూట్‌ రసం, మజ్జిగ పులుసు, గోభీ ఆవకాయ, నెయ్యి, వడియాలు, ద్రాక్ష పండ్ల పచ్చడి, చల్ల మిర్చి ఉంటాయి. అలాగే కట్‌ ఫ్రూట్స్, ఐస్‌క్రీం, పేస్ట్రీ, కాలా జామున్, జున్ను చంద్రకాంతలు సిద్ధం చేసారు.
ప్రత్యేక రుచులతో అతిధుల కోసం

ప్రత్యేక రుచులతో అతిధుల కోసం

రెండో రోజు శనివారం లంచ్‌లో రష్యన్‌ సలాడ్స్, వెజ్‌ సలాడ్‌లతో పాటు రుమాలి రోటీ, బటర్‌ నాన్‌ ఇస్తారు. నాన్‌ వెజ్‌ రకాల్లో ఆంధ్రా చికెన్‌ కర్రీ, చేప ఫ్రై, గోంగూర, రొయ్యల కూర, ఎగ్‌ మసాలా, మటన్‌ పలావ్‌.. వెజ్‌ ఐటమ్స్‌లో వెజ్‌ బిర్యానీ, కరివేపాకు రైస్, కడాయ్‌ పన్నీరు కూర, క్యారెట్‌ బీన్స్‌ కొబ్బరి ఫ్రై, వంకాయ మెంతి కారం, బెండకాయ-జీడిపప్పు ఫ్రై, పప్పుచారు, మిరియాల రసం, మజ్జిగ పులుసు, ఉలవచారు-క్రీం వంటివి ఉన్నాయి. ఇంకా కట్‌ ఫ్రూట్స్, ఐస్‌క్రీం, బ్రౌనీ, గులాబ్‌జామ్, అంగూర్‌ బాసుంది, డబుల్‌కా మీఠా ఇస్తారు. ఉదయం అల్పాహారంలో ఇడ్లీ, వడ, టమా­టా బాత్, హాట్‌ పొంగల్, ఉదయం స్నాక్స్‌­లో ప్లమ్‌ కేక్, డ్రై కేక్, వెజ్‌ బుల్లెట్, మఫిన్స్, స్ప్రింగ్‌ రోల్స్, సాయంత్రం స్నాక్స్‌లో కుకీస్, చీజ్‌ బాల్స్, డ్రై ఫ్రూట్‌ కేక్, ఫ్రూట్‌ కేక్, కట్‌ మిర్చి బజ్జీలు, టీ, కాఫీ ఉంటాయి.
రెండు లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా

రెండు లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా


సదస్సులో భాగంగా ముఖ్యమంత్రి జగన్ ఈ మధ్యాహ్నం కీలక ప్రసంగం చేయనున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించనున్నారు. పలువురు పారిశ్రామిక వేత్తలు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. 30మంది బిజినెస్ లీడర్స్ హాజరవుతున్న ఈ సదస్సులో రేపు శనివారం కీలక ఒప్పందాలు జరగనున్నాయి. ఏపీలో పెట్టుబడుల పైన ప్రభుత్వంతో ఎంఓయూలు జరగుతాయి. రెండు లక్షల కోట్ల పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రకటించింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పెవిలియన్ ద్వారా ఏపీ సామర్ధ్యాలను ప్రదర్శిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు చర్చాగోష్ఠులు జరగనున్నాయి. వివిధ రంగాల్లో పెట్టుబడి అవకాశాలపై వీరు చర్చించనున్నారు. రేపు ఉదయం 9.30 గంటల నుంచి 10.30 గంటల వరకు పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకోనున్నారు. ఏపీలో ఈ
సదస్సు గేమ్ ఛేంజర్ గా ప్రభుత్వం భావిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+