అమరావతి సభకు జగన్- కీలక మంత్రాంగం, నిర్ణయం వెనుక..!?

ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. అమరావతికి ప్రధాని మోదీ వస్తున్నారు. మే 2న అమరావతి పనుల రీ లాంఛ్ సభలో పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ఇదే సమయంలో రాజకీయాలకు అతీతంగా అమరావతి సభకు అందరినీ ఆహ్వానిస్తోంది. మాజీ సీఎం జగన్ కు ఆహ్వానం పంపారు. ఈ కార్యక్రమానికి జగన్ హాజరవుతారా. పార్టీలో ఏం చర్చించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జగన్ భావిస్తున్నారా.. ఇంతకీ ఏం జరుగుతోంది.

జగన్ కు ఆహ్వానం
అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమాల ప్రారంభోత్సవానికి మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డికి అధికార ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఆహ్వానం పంపింది. అమరావతి రీ-లాంచ్ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌కు కూడా ఆహ్వానం పంపారు. ఆహ్వాన పత్రికను వ్యక్తిగతంగా అందించేందుకు ప్రభుత్వ అసిస్టెంట్ ప్రోటోకాల్ అధికారి ఫజల్ స్వయంగా తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లారు. అయితే జగన్ అందుబాటులో లేకపోవడంతో ఆయన వ్యక్తిగత కార్యదర్శి నాగేశ్వర రెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేశారు. అయితే, ఇప్పుడు ప్రభుత్వం నుంచి ప్రధాని వస్తున్న కార్యక్రమానికి జగన్ కు ఆహ్వానం అందటంతో ఆయన హాజరు గురించి పార్టీలో చర్చ జరుగుతోంది.

ap-govt-invites-ys-jagan-for-amaravati-re-launch-details-here

పార్టీ నేతలతో చర్చ
మాజీ సీఎం జగన్ అమరావతి సభకు హాజరు కావాలని పార్టీ నేతలు సూచిస్తున్నారు. గతంలో మూడు రాజధానుల పేరుతో అమరావతి అందులో ఒక రాజధానిగా జగన్ పేర్కొన్నారు. అయితే, జగన్ నిర్ణయానికి ఎన్నికల్లో మద్దతు లభించ లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమరావతి మాత్రమే రాజధానిగా స్పష్టం చేసింది. కూటమికి ప్రజలు మద్దతుగా నిలిచారు. ప్రతిష్ఠాత్మకమైన రాజధాని నిర్మాణం ప్రారంభోత్సవానికి ప్రధాని హాజరవుతున్నారు. ప్రభుత్వం ఇప్పుడు జగన్ ను ఆహ్వానించటం ద్వారా పై చేయి సాధించే ప్రయత్నం చేసింది. దీంతో, జగన్ హాజరు అయితే అమరావతి వ్యవహారం లో జగన్ పైన జరుగుతున్న వ్యతిరేక చర్చకు ముగింపు వస్తుందని.. దీని ద్వారా జగన్ లో మార్పు వచ్చిందనే సంకేతాలు వెళ్తాయని పార్టీ నేతలు సూచిస్తున్నారు.

Take a Poll

జగన్ హాజరయ్యేనా
కాగా, జగన్ కు ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందటంతో పార్టీ నేతలతో చర్చించారు. ఈ రోజు ముఖ్య నేతలు జగన్ ను కలవనున్నారు. జగన్ ప్రస్తుతం అమరావతిలో జరుగుతున్న టెండర్ల వ్యవహారం పైన ఆరోపణలు చేస్తున్నారు. అయితే, రాజధానిగా అమరావతి మాత్రమే ఉండటం ఖాయం. ఇక భవిష్యత్ లో మార్పుకు అవకాశం లేదనేది సుస్పష్టం. దీంతో, జగన్ ఇప్పుడు హాజరు అవ్వటం మంచి సంకేతాలు ఇస్తుందనే చర్చ ఉంది. అయితే.. జగన్ తాను స్వయంగా హాజరు అవుతారా.. లేక, పార్టీ నుంచి ప్రతినిధులను పంపుతారా అనేది ఈ రోజు స్పష్టత రానుంది. దీంతో.. జగన్ తీసుకునే నిర్ణయం పైన రాజకీయంగా ఆసక్తి కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+