అప్పుల కోసం ఏపీ తిప్పలు - కుదువ పెట్టటం ద్వారా : ఆర్ అండి బి ఆస్తులు ఆర్డీసీకి బదలాయింపు..!!
ఆర్దికంగా కష్టాల్లో ఉన్న ఏపీ ప్రభుత్వం రుణ సమీకరణ కోసం అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. తమ పరిధిలో ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవటానికి సిద్దంగా లేదు. ఒక వైపు సంక్షేమ పధకాల భారం.. మరో పైపు పెరగని రెవిన్యూతో కొత్త మార్గాల్లో అప్పుల కోసం ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా..ఇప్పటికే విశాఖలో కొన్ని ఆస్తులను తనఖా రిజిస్ట్రేషన్ చేసిన ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఏపీ లోని రాష్ట్ర వ్యాప్తంగా రహదారులు భవనాల శాఖ(ఆర్‌అండ్‌బీ)కు అన్ని జిల్లాల్లో ఉన్న రూ.3,786.15 కోట్ల విలువైన ఆస్తులను ఏపీ రహదారుల అభివృద్ధి సంస్థ (ఏపీఆర్డీసీ)కు బదలాయిస్తూ గజెట్ జారీ చేసింది.
ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ లో ఆర్ అండ్ బి శాఖ పరిధిలోని 574.37 ఎకరాల స్థలాలు, రూ.392.50 కోట్ల విలువైన 3.31 లక్షల చదరపు గజాల విస్తీర్ణంలో భవనాలు ఉన్నాయి. కాగా, వీటి విలువ దాదాపుగా ,
కోట్లుగా నిర్ధారించారు. అయితే, ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ లో భాగంగా ఏపీఆర్డీసీ అదనపు ఆదాయ వనరులు సమీకరించుకొని, రహదారుల సదుపాయాలు మెరుగుపరుచుకొనేందుకు వీలు కలుగుతుందని పేర్కొంది. గతంలోనే ఆర్డీసికి ఆదాయం ఏ విధంగా సమీకరించుకోవాలనే అంశం పైన అధ్యయనం చేసారు.

ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా చేస్తున్నారనే దాని పైన అధ్యయనం జరిగింది. అందులో భాగంగా.. రాష్ట్ర రహదారులపై టోల్ వసూలు, ఖాళీ స్థలాలు లీజులకు ఇవ్వడం, రోడ్లపై హోర్డింగ్‌లకు అనుమతించడం లేదని అధ్యయనంలో భాగంగా గర్తించారు. ఇక, తాజాగా జరిగిన మంత్రివర్గంలో ఆర్ అండ్ బీ ఆస్తులను ఆర్డీసీకి బదలాయించేందుకు వీలుగా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఆర్ అండ్ బి ఆస్తులను ఆర్డీసీకి బదలాయించటం ద్వారా వాటిని తనఖా పెట్టటం లేదా లీజులకు ఇవ్వటం ద్వారా ఆదాయం సమకూర్చుకోవచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
దీని పైన ప్రభుత్వ వర్గాల వాదన మరో విధంగా ఉంది. 2018 లో ఆర్డీసీ బ్యాంకుల నుంచి మూడు వేల కోట్ల రూపాయాల రుణం తీసుకుందని..అయితే, సంస్థ బ్యాలెన్స్ షీట్ ఆ మేర తక్కువగా ఉందని చెబుతున్నారు. దీంతో..ఆర్ అండ్ బీ ఆస్తులను దీని పరిధిలోకి తీసుకురావటం ద్వారా బ్యాలెన్స్ షీట్ సర్దుబాటుకు అవకాశం ఏర్పడుతుందనే వాదన వినిపిస్తున్నారు. కానీ, ఇప్పుడు రాష్ట్ర ఆర్దిక పరిస్థితి... నిధుల కోసం వెంపర్లాటలో భాగంగా ప్రభుత్వం ఏ నిధులకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా...చర్చకు కారణమవుతోంది.
Recommended Video
అయితే, తాము చేస్తున్న అప్పులు సంక్షేమం కోసమే ఖర్చు చేస్తున్నామనేది ప్రభుత్వ వాదన. ఇప్పుడు ఆర్డీసీ ద్వారా సైతం కొత్త నిధల సమీకరణ మొదలువుతందనే వాదన సైతం వినిపిస్తోంది. మరి.. రానున్న రోజుల్లో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.












Click it and Unblock the Notifications