వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో 5 నుంచి జగనన్న విద్యా కానుక - పంపిణీకి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన 'జగనన్న విద్యా కానుక' పంపిణీకి సంబంధించి మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 42 లక్షల 32 వేల మంది విద్యార్థులకు తలా మూడు జతల యూనిఫాం, నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, ఒక జత బూట్లు, సాక్సులు, బెల్టు, స్కూల్ బ్యాగ్ ను అందించనున్నారు.

సెప్టెంబరు 5 నుంచి జగనన్న విద్యా కానుక పంపిణీ ప్రారంభించేందుకుగానూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు అనుమతి ఇస్తూ జగన్ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ, మండల ప్రజా పరిషత్, మున్సిపల్, గురుకుల పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు, ప్రభుత్వ అనుమతి ఉన్న మదర్సాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఎస్పీ బాలు చేతి వేళ్లతో సైగలు - నిజంగా శుభదినమంటూ ఎస్పీ చరణ్ ఉద్వేగం - ఇంకా వెంటిలేటర్ పైనే..ఎస్పీ బాలు చేతి వేళ్లతో సైగలు - నిజంగా శుభదినమంటూ ఎస్పీ చరణ్ ఉద్వేగం - ఇంకా వెంటిలేటర్ పైనే..

AP Govt issued orders for distribution of Jagananna Vidya Kanuka on tuesday

2020-21 విద్యా సంవత్సరానికి డ్రాపవుట్ల సంఖ్యను తగ్గించేందుకు , వివిధ అంశాలను నేర్చుకోగోరే విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంచుకునేందుకు జగనన్న విద్యా కానుక పథకం తోడ్పడుతుందని అధికారులు తెలిపారు. గత కేబినెట్ మీటింగ్ లో ఈ పథకంపై చర్చ జరగ్గా, సెప్టెంబర్ 5 నాటికి విద్యాకానుక కిట్లు పంపిణీకి సిద్ధంగా ఉంచాలని సీఎం జగన్ ఆదేశించిన సంగతి తెలిసిందే.

షాకింగ్: మహిళా ఎస్సైపై అత్యాచారం - తోటి ఎస్సై ఘాతుకం - సెటిల్మెంట్ - కులం తక్కువని రివర్స్షాకింగ్: మహిళా ఎస్సైపై అత్యాచారం - తోటి ఎస్సై ఘాతుకం - సెటిల్మెంట్ - కులం తక్కువని రివర్స్

ఏపీలో సెప్టెంబర్ 5 నుంచి ప్రభుత్వ పాఠ‌శాల‌ల‌ను ప్రారంభిస్తామ‌ని, ఉపాధ్యాయుల దినోత్సవమైన(సెప్టెంబర్ 5) అదే రోజు 43 ల‌క్షలపైచిలుకు విద్యార్థుల‌కు విద్యా కానుక ఇస్తామ‌ని, ఇందుకుగానూ మొత్తం రూ.650 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఇదివరకే తెలియజేశారు. ఇక, అక్టోబర్ 15 నుంచి జూనియర్ కాలేజీలు రీఓపెన్ అవుతాయని, సెప్టెంబర్ 15 నుంచి 21 లోపు ప్రవేశాలకు సంబంధించి సెట్లను నిర్వహిస్తామ‌ని ఆయన స్పష్టం చేశారు.

English summary
Andhra Pradesh Government on tuesday issued orders for distribution of Jagananna Vidya Kanuka. earlier, CM has instructed officials to start Jagananna Vidya Kanuka from September 5.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X