'తల్లికి వందనం' నిధులు జమ కాలేదా - ఇలా చేయండి, వెంటనే మీ ఖాతాల్లోకి..!!
ఏపీ ప్రభుత్వం పథకాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తల్లికి వందనం పథకం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రెండో విడత నిధులను ఈ నెల 22న విడుదల చేసారు. ఇప్పటికే జాబితాలను సచివాలయాల్లో అందుబాటులో ఉంచారు. అర్హత ఉండీ.. నిధులు జమ కాని వారికి ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. ప్రభుత్వ సూచనలు అమలు చేయటం ద్వారా నిధులు జమ కానున్నాయి.
ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం నిధులు ఇప్పటికే విడుదల చేసింది. ఈ నెల 22వ తేదీ నుంచి మూడు రోజుల్లో నిధులు పూర్తిగా అర్హుల ఖాతాల్లో జమ అయ్యే విధంగా ప్రణాళికలు అమలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ ఏడాది 67.47 లక్షల మంది విద్యార్థులకు సంబంధించి 42.70 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.10,120.78 కోట్లు జమ చేసారు. ఇప్పటికీ కొందరు అర్హులకు నిధులు జమ కాలేదనే సమాచారం అందుతోంది. దీంతో.. అధికారులు అర్హత ఉండీ నిధులు జమ కాని వారికి కీలక సూచనలు చేస్తున్నారు. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో అర్హుల జాబితాను అందుబాటులో ఉంచారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకూ చదివే విద్యార్థులందరికీ ఈ పధకం వర్తిస్తుంది. గత ఏడాది తల్లికి వందనం పథకం నిధులు అంది..ఈ ఏడాది అందని వారికి ఈ సూచనలు వర్తిస్తాయి.

నిధులు అందని వారు ఇలా చేయండి
అర్హత ఉండీ.. నిధులు అందని వారు నేటి నుంచి 10 రోజుల్లోగా గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అర్హత ఉన్న వారందరూ నేటి నుంచి దరఖాస్తు చేసుకుంటే మరోసారి పరిశీలించి వారికి నగదును చెల్లించనున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా తమ అర్హతలను సూచిస్తూ దరఖాస్తు చేసుకోవాలి. వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా గ్రీవెన్స్ మాడ్యూల్లో రిక్వెస్ట్ పెట్టాలి. విద్యుత్ బిల్లులు సహా ఇతర కారణాలతో ప్రయోజనం పొందనివారు దరఖాస్తు చేయొచ్చు. తప్పుడు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ తో అర్హత ఉన్నా తల్లికి వందనం కోల్పోయిన చాలా మంది తల్లులున్నారు. వారు కూడా దరఖాస్తును చేసుకోవచ్చు. అన్నీ అర్హతలను పరిశీలించిన తర్వాత అర్హులైన వారందరికీ తల్లికి వందనం దరఖాస్తు చేసుకోవటం ద్వారా.. అధికారులు పరిశీలించి అర్హుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు.












Click it and Unblock the Notifications