ఆర్టీసీ ఉద్యోగులకు గెజిటెడ్ హోదా - విభజన..!!
ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జగన్ హయాంలో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసారు. ఆ తరువాత ప్రభుత్వ ఉద్యోగుల తరహలోనే గజిటెడ్ హోదా పైన నిర్ణయం పెండింగ్ ల ఉంది. ఇప్పుడు తాజాగా ప్రభుత్వం ఉద్యోగులు, అధికారులకు గెజిటెడ్ హోదా కల్పిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ గజిటెడ్ హోదాను అయిదు రకాలుగా విభజిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ప్రభుత్వంలో విలీనంతో
2020 లో ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వంలో విలీనం చేసారు. ఆ తరువాత ఆర్టీసీలో పని చేస్తున్న అనేక కేడర్ల ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులతో సమాన కేడర్ ఇవ్వాలని అభ్యర్ధనలు వచ్చాయి. దీంతో డిపార్టమెంట్‌ను సంప్రదించిన తరువాత.. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగుల వివిధ కేడర్‌లను.. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా నిర్దారించేందుకు సరైన ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వం రవాణా శాఖ కమిషనర్‌ను ఆదేశించింది.

ఉద్యోగుల హోదా
పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ ఈ ప్రతిపాదనను పరిశీలించి.. జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంతో సంప్రదింపులు కొనసాగించింది. దీంతో, జఏడీ2024 జనవరి 4న ఉద్యోగులకు "గెజిటెడ్" హోదాను కేటాయించే ప్రతిపాదనను అంగీకరించింది. ప్రజా రవాణా శాఖ రాష్ట్ర సేవలను ఐదు గెజిటెడ్ స్థాయిగా వర్గీకరించారు. ప్రభుత్వం విభజించిన కేడర్ మేరకు అసిస్టెంట్ మేనేజర్‌లు (ఫైనాన్స్, ట్రాఫిక్, పర్సనల్, స్టాటిస్టిక్స్, మెటీరియల్స్ కొనుగోలు), నర్సింగ్ సూపరింటెండెంట్, చీఫ్ సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ ఇంజనీర్లు (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్)లకు లెవల్-1 గెజిటెడ్ హోదా దక్కనుంది.
నోటిఫికేషన్ జారీ
జూనియర్ స్కేల్ సర్వీస్ ఉద్యోగులకు లెవెల్-2 గెజిటెడ్ హోదా దక్కుతుంది. అదూ విధంగా సీనియర్ స్కేల్ సర్వీస్ ఉద్యోగులకు (డివిజనల్ మేనేజర్, తత్సమాన పోస్టులు) లెవెల్-3 గెజిటెడ్ హోదా కల్పించారు. స్పెషల్ స్కేల్ సర్వీస్ ఉద్యోగులకు (రీజినల్ మేనేజర్, తత్సమాన పోస్టులు) లెవెల్-4 గెజిటెడ్ హోదా ఇచ్చారు. సూపర్ స్కేల్ సర్వీస్ ఉద్యోగులకు (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్) లెవెల్-5 గెజిటెడ్ హోదా కల్పించారు.












Click it and Unblock the Notifications