సచివాలయాల్లో కీలక మార్పులు, కొత్త బాధ్యతలు - ఆర్దినెన్స్ జారీ..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సచివాలయాల ఉద్యోగుల హేతుబద్ధీకరణ.. విధుల విషయంలో మార్పులు తెచ్చింది. వాలంటీర్ల వ్యవస్థ లేకపోవటంతో సచివాలయాల ఉద్యోగులతోనే పెన్షన్ల పంపిణీ.. ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేస్తోంది. సచివాలయాల పేర్ల మార్పు పైన నిర్ణయం తీసుకుంది. తాజాగా సచివాలయాల ముఖచిత్రం మార్పు చేస్తూ.. సేవల్లో పారదర్శకత తీసుకొస్తూ తాజాగా ఆర్డినెన్స్ జారీ చేసింది.
సచివాలయ వ్యవస్థలో ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది. సచివాలయాల ఉద్యోగులు.. సేవల విషయంలో కొత్త నిర్ణయాలు అమలు చేస్తోంది. ప్రజలకు మరింత పారదర్శక సేవలు అందించాలని నిర్ణయించింది. అందులో భాగంగా రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల పేర్లు స్వర్ణగ్రామం, స్వర్ణవార్డుగా మార్పు చేసారు. ఇదే సమయంలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆర్డినెన్సు జారీ చేశారు. ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల చట్టం-2023ను సవరిస్తూ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను ఆయన ఆమోదించారు. డిసెంబరు 30న జరిగిన మంత్రివర్గ సమావేశంలో చట్ట సవరణ ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది. స్వర్ణాంధ్ర లక్ష్యసాధనలో గ్రామ, వార్డు సచివాలయాలు కీలకపాత్ర పోషిస్తాయని, దానికి అనుగుణంగా కార్యనిర్వాహకుల పాత్రలు, బాధ్యతలను సవరించాల్సిన అవసరం ఉందని, ఈ నేపథ్యంలోనే గ్రామ, వార్డు సచివాలయాల పేర్లు మార్చాలని మంత్రి మండలి నిర్ణయించింది.

కాగా, ఈ ఆర్డినెన్సు ప్రకారం జీఎస్ డబ్ల్యూఎస్ శాఖ పేరును ఇక నుంచి స్వర్ణగ్రామం, స్వర్ణవార్డు శాఖగా పిలుస్తారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల బోర్డులు, అధికారిక లెటర్ హెడ్లను తక్షణమే ఈ కొత్త పేర్లకు అనుగుణంగా మార్చాలని ప్రభుత్వం ఇటీవల మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలను ఆదేశించింది. సంస్కరణల్లో భాగంగా సచివాలయ వ్యవస్థకు సరికొత్త గుర్తింపు తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ మార్పు కేవలం పేరుకే పరిమితం కాకుండా, ప్రజలకు మరింత పారదర్శకంగా సేవలు అందించడమే ఉద్దేశమని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇదే సమయంలో సచివాలయాల ద్వారానే ప్రజలకు అందించే సేవల పైన ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. సర్వేలత పాటుగా సచివాలయ పరిధిలోని ప్రతీ ప్రభుత్వ సేవ బాధ్యతలను అప్పగించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల సమాచారం.. లబ్దిదారుల విషయంలోనూ సచివాలయాలు పూర్తిగా అందుబాటులో ఉండేలా నిర్ణయం తీసుకున్నారు.












Click it and Unblock the Notifications