అమరావతి రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక నుంచి..!!
రాజధాని అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. రాజధాని కోసం రెండో విడత భూ సమీకరణ కొనసాగుతోంది. రైతులకు ఇచ్చిన హామీల అమలు దిశగా కార్యాచరణ ప్రభుత్వం వేగవంతం చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ వీటి పైన చర్చించి పరిష్కారం దిశగా కసరత్తు చేస్తోంది. కాగా, తాజాగా రైతులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న ప్రభుత్వం వారికి తీపి కబురు అందించింది. నిర్మాణాల వేగవంతం పైనా నిర్ణయం తీసుకుంది.
భూ సమీకరణకు సహకరించిన ప్రతీ రైతుకు ప్రభుత్వం ఇచ్చిన ప్రతీ హామీ నెరువేరుస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేసారు. అమరావతి సమీప గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నా మని మంత్రి నారాయణ వెల్లడించారు. ఈ పనులు సుమారు రూ.900కోట్లతో ప్రారంభించినట్లు చెప్పుకొచ్చారు. రాజధానితో పాటుగా గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఆరు నెలల్లోగా అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తామని నారాయణ హామీ ఇచ్చారు. అదే విధంగా భూములు తీసుకునే సమయంలో ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు. వీటి విషయంలో ఎవరికీ సందేహాలు అవసరం లేదని స్పష్టం చేసారు. గ్రామాల అభివృద్ధిపై గ్రామస్థుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్న మంత్రి నారాయణ.. గ్రామాల్లో కోట్లాది రూపాయలతో తమ ప్రభుత్వం మౌలిక వసతుల పనులు చేపడుతోందని వెల్లడించారు.

గ్రామస్థులు ప్రస్తావించిన అంశాలతో పాటుగా కోరుతున్న అభివృద్ధి కార్యక్రమాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఒక్కొక్క గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేస్తున్నామో మంత్రి నారాయణ వివరిస్తున్నారు. ప్రస్తుతం 29 గ్రామాల రైతులకు ఇస్తున్న వార్షిక కౌలును తమకు పెంచి ఇవ్వాలని, గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించాలని భూములిచ్చిన రైతులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అలాగే రాజధానిపై పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం అయ్యేలా చర్యలు తీసుకోవాలని, ప్యాకేజీ పెంచాలని రైతులు మంత్రికి విన్నవించారు. వీటి పైన ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి చెప్పారు. అదే విధంగా గతంలో రైతులకు ఎదురైన ఇబ్బందులు పునరావృతం కాకుండా పరిష్కరిస్తామని, 29 గ్రామాలతో పాటు సమానంగా మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి తెలిపారు. రాజధాని నిర్మాణంలో భాగంగా స్మార్ట్ ఇండస్ట్రీలు, అంతర్జాతీయ విమానాశ్రయం, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.
-
జగన్ అరెస్ట్ ఖాయం - తేల్చేసిన బీజేపీ ముఖ్య నేత..!! -
అమరావతి పై వెంకయ్య కీలక ప్రతిపాదన, అమిత్ షా అంగీకారం..!! -
ఏపీ రాజధానిని మళ్లీ మార్చుకోవచ్చా ? అమరావతి గెజిట్ కూడా సరిపోదా ? -
'అమరావతి' పై మారిన జగన్ నిర్ణయం, ఢిల్లీ మంత్రాంగం - పార్లమెంట్ సాక్షిగా..!! -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు!












Click it and Unblock the Notifications