ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం: ఈఏపీసెట్ ఇంటర్ మార్కుల వెయిటేజీ తొలగింపు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశాలకు(ఈఏపీసెట్) ఇంటర్ మార్కుల వెయిటేజ్ తొలగించింది. ఇప్పటి వరకు ఇంటర్ మార్కులకు ఇస్తున్న 25 శాతం వెయిటేజీని తొలగించింది.
ఈ ఏడాది ఈఏపీసెట్ 100 శాతం రాత పరీక్ష మార్కుల ఆధారంగానే ప్రవేశాలు ఉంటాయని ఉన్నత విద్యామండలి కార్యదర్శి సుధీర్ ప్రేమ్ కుమార్ వెల్లడించారు. కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఇంటర్ పరీక్షలు రద్దు చేసినందున ఈ ఒక్క ఏడాదికే ఇంటర్ మార్కుల వెయిటేజీ తొలగింపు అమలు చేయనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు.

ఏపీ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష(ఈఏపీసెట్)-2021ను ఆగస్టు 19 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇప్పటికే ప్రకటించారు. కాగా, ఈఏపీసెట్‌ను గతంలో ఎంసెట్‌గా పిలిచేవారు.
Recommended Video
వైద్య విద్యలో ప్రవేశల కోసం జాతీయ స్థాయిలో ప్రత్యేక పరీక్ష(నీట్) నిర్వహిస్తున్నందున ఎంసెట్‌లో ఎం అనే అక్షరాన్ని తొలగించారు. ఫార్మా ప్రవేశాలను ఈ ప్రవేశ పరీక్ష ద్వారా నిర్వహిస్తున్నందున ఎం స్థానంలో 'పీ'తీ సదకపసీ ఐఏపీసెట్‌గా మార్పు చేశారు.












Click it and Unblock the Notifications