ఇంటర్ విద్యార్దులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇక నుంచి..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. గత ప్రభుత్వ నిర్ణయాలను సమూలంగా మార్చేస్తోంది. పథకాల పేర్లు మార్పు చేస్తోంది. ఉప ముఖ్యమంత్రిగా పవన్ బాధ్యతలు స్వీకరించారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో అసెంబ్లీ కొలువు తీరనుంది. ఇదే సమయంలో ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా రూ 4 వేలకు పెన్షన్ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఇంటర్ విద్యార్ధుల కోసం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇంటర్ విద్యార్ధుల కోసం ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, బ్యాగులు ఉచితంగా పంపిణీ చేయాలని ఆదేశిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. మంత్రి నారా లోకేశ్ మొదటి సమీక్షలో దీనిపై అధికారులను ఆదేశించగా, ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. గత ప్రభుత్వంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివినా పాఠ్య పుస్తకాలు ఉచితంగా ఇవ్వలేదు. ప్రభుత్వ కాలేజీల్లో సుమారు 2లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వారికి పాఠ్య పుస్తకాలు ఇచ్చేందుకు రూ.15 కోట్లు అవుతుందని అప్పట్లో అంచనా వేశారు.

జగన్ ప్రభుత్వం ఆ నిధులను విడుదల చేయలేదు. తాజా నిర్ణయం మేరకు.. పాఠ్య పుస్తకాలతో పాటు నోట్ పుస్తకాలు, బ్యాగులు కూడా ఉచితంగా ఇవ్వనుంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలలు, గురుకుల విద్యాలయాలు, హైస్కూల్ ప్లస్‌లలో ఫస్టియర్ విద్యార్థులు 108619 మంది, సెకండియర్ విద్యార్థులు 92134 మంది ఉన్నారు. వీరికి జూలై 15లోగా పుస్తకాలు, బ్యాగులు పంపిణీ చేయాలని ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. పాఠ్య పుస్తకాలను తెలుగు అకాడమీ, ప్రభుత్వ పాఠ్య పుస్తకాల డైరెక్టర్ ద్వారా సమకూర్చాలని, నోట్ పుస్తకాలు, బ్యాగులు అదనంగా కొనుగోలు చేయాలని ఆదేశించింది. జూలై 15 నాటికి పాఠ్యపుస్తకాలు పంపిణీ పూర్తి చేయాలని స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications