కొడాలి నాని ఉక్కిరి బిక్కిరి - తాజా నిర్ణయంతో..!!
మాజీ మంత్రి కొడాలి నానికి వరుస షాక్ లు తగులుతున్నాయి. తాజా ఎన్నికల్లో వైసీపీతో పాటుగా కొడాలి నాని గుడివాడ నుంచి ఓడిపోయారు. మంత్రిగా, ఆ తరువాత కాలంలో కొడాలి నాని చేసిన అనుచిత వ్యాఖ్యలతో టీడీపీ నాని పైన గురి పెట్టింది. ఎలాగైనా గుడివాడలో ఓడించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అసెంబ్లీ పోరులో గుడివాడలో వెనిగళ్ల రాము చేతిలో కొడాలి నాని ఓడిపోయారు. ఆ తరువాత ఒక దాని తరువాత మరొకటి వరుస నిర్ణయాలు నానిని ఉక్కరిబిక్కిరి అవుతున్నారు.
వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని ఇప్పుడు టార్గెట్ అవుతున్నారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు తరువాత వరుస నిర్ణయాలు జరుగుతున్నాయి. తాజా ఎన్నికల్లో ఓడిన కొడాలి నాని గతంలో చంద్రబాబు గురించి చేసిన వ్యాఖ్యల పైన టీడీపీ శ్రేణులు ఆగ్రహంతో ఉన్నారు. ఆయన ఇంటి పైన దాడికి ప్రయత్నించారు. కోడిగుడ్లు విసిరి నినాదాలు చేసారు. ఆ తరువాత గుడివాడలో కొడాలి నాని అనుచరులు ఆక్రమించుకున్న 7.66ఎకరాల స్థలాన్ని యజమానులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గుడివాడ రాజేందర్ నగర్‌లో రూ.100కోట్ల స్థలాన్ని నాని అనుచరులు ఆక్రమించుకున్నారు.

ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో స్థల యజమానులకు ఎమ్మెల్యే రాము భరోసా ఇచ్చారు. దీంతో స్థలం చుట్టూ ఉన్న ఫెన్సింగ్, లేఅవుట్‌లో గడ్డం గ్యాంగ్ ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక నిర్మాణాలను జేసీబీలతో ధ్వంసం చేశారు. ఇక, తాజాగా నానికి గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన భద్రత పైన అధికారులు సమీక్ష చేసినట్లు తెలుస్తోంది. నానికి, ఆయన ఇంటికి కల్పించిన భద్రత ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. కొడాలి నాని, వల్లభనేని వంశీ పైన ఇప్పటికీ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో, ఇప్పుడు ఈ వరుస నిర్ణయాలతో కొడాలి నాని ఎలాంటి అడుగులు వేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications