వాలంటీర్లపై ప్రభుత్వం తాజా ఆదేశాలు- తొలిగించాల్సిందే..!!
ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు పై సస్పెన్స్ కొనసాగుతోంది. అధికారంలోకి వచ్చిన తరువాత వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. వాలంటీర్లు లేకుండానే పెన్షన్ల పంపిణీ రెండు నెలలు పూర్తి చేసారు. వాలంటీర్ల కొనసాగింపు పైన ప్రభుత్వం కొత్త ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నిర్ణయం పైన ఆసక్తి కొనసాగుతోంది. ఇదే సమయంలో వాలంటీర్లకు సంబంధించి ప్రభుత్వం తాజాగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వం తాజా ఆదేశాలు
గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్లు పథకాలు, నిర్ణయాలను ప్రజలకు అందించేందుకు వాట్సప్, టెలిగ్రాం గ్రూపులను నిర్వహించారు. తమ క్లస్టర్ పరిధిలోని లబ్దిదారులతో ఈ గ్రూపులను కొనసాగించారు. వాలంటీర్లు నిర్వహించిన అన్ని గ్రూపులను తొలిగించాని వార్డు, గ్రామ సచివాలయాల ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. క్షేత్ర స్థాయిలో వెంటనే ఆదేశాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.తొలిగించిన గ్రూపుల వివరాలు ఈ సాయంత్రం లోపు ఇవ్వాలని నిర్దేశించారు.

వాలంటీర్ల సేవలపై
ప్రజలను కూడా ఆ వాట్సప్ గ్రూపుల నుంచి ఎగ్జిట్ అయ్యేలా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. మార్చి 16న ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వం వాలంటర్లకు అందించిన మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులను వార్డు, గ్రామ సచివాలయాల శాఖ స్వాధీనం చేసుకుంది. ఎన్నికలు పూర్తయిన తరువాత ఇప్పటి వరకు వాటిని తిరిగి ఇవ్వలేదు. ఇక..రాజీనామా చేసిన వాలంటీర్లను మినహాయించి మిగిలిన వాలంటీర్ల కొనసాగింపు విషయంలోనూ ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో స్పష్టత రావటం లేదు.
ప్రభుత్వం కసరత్తు
వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని మంత్రులు చెబుతున్నారు. అయితే, వాలంటీర్ల ప్రస్తుత సంఖ్యను తగ్గిస్తూ..సేవలను పరిమితం చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. అదే సమయంలో వాలంటీర్ల విద్యార్హతల ఆధారంగా వారికి స్కిల్ శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. వాలంటీర్లకు రూ 10 వేలు చొప్పున వేతనాలు ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. వాలంటీర్ల కొనసాగింపు..విధి విధానాల ఖరారు పైన అధికారుల నుంచి నివేదిక కోరారు. ీ నెల 7న జరిగే మంత్రివర్గ సమావేశంలో వాలంటీర్ల కొనసాగింపు..విధుల పైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications